పగిలిన పెదవులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Published : Jun 20, 2022, 03:03 PM IST

Chapped Lips Remedies: శరీరానికి అవసరమైన నీళ్లను తాగకపోయినా..  శీతాకాలం వచ్చినా పెదాలు పగులుతుంటాయి. అయితే కొన్ని హోం రెమిడీస్ తో పెదాల పగుళ్లకు చెక్ పెట్టొచ్చు. అవేంటంటే.. 

PREV
16
పగిలిన పెదవులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

యాంటీ ఆ క్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉండే లిప్ బామ్ లు అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తాయి. పలిగిల పెదాలకు వీటిని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే పొడిబారిన, పగిలిన పెదవులకు తేనె(Honey), చక్కెర (Sugar)ను ఉపయోగించినా చక్కటి ఫలితం ఉంటుంది.  ఇందుకోసం..  ఒక చెంచా తేనెలో అర టీస్పూన్ పంచదారను మిక్స్ చేసి పెదవులకు అప్లై చేయాలి. తర్వాత పెదవులను 5 నుంచి 10 నిమిషాల పాటు సున్నితంగా రుద్ది, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

26
coconut oil

పొడిబారిన చర్మాన్ని చికిత్స చేయడంలో కొబ్బరి నూనె (Coconut oil)చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. కొబ్బరినూనెను ఉపయోగించిన తరువాత పగిలిన, పొడి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ నూనెను Regular గా ఉపయోగించడం వల్ల చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు (Healthy fatty acids)ఉంటాయి. ఇది పెదవులను మృదువుగా (Soft), గులాబీ రంగులోకి మార్చడానికి సహాయపడుతుంది.

36

పాలు (Milk)కూడా  పగిలిన పెదవులకు నివారణా ఉపయోగపడుతుంది. ఇందుకోసం పాలను కాటన్ లో ముంచి పెదవులపై అప్లై చేయాలి. ఇది మాయిశ్చరైజర్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే పెదవులను ఎండిపోకుండా చేసి.. పగుళ్లు రాకుండా కాపాడుతుంది. 

46

గులాబీ రేకులు (Rose petals) కూడా పెదవుల పగుళ్లనుంచి బయటపడేస్తాయి. ఇందుకోసం గులాబీ రేకులను పాలతో మిక్స్ చేసి పెదవులకు అప్లై చేయండి. గులాబీ రేకుల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ పెదవులకు పోషణను అందిస్తుంది. పాలు చర్మం నుంచి మృత కణాలను తొలగిస్తాయి.

56

కలబంద (Aloe vera): కలబంద జెల్  (Aloe vera gel) పెదవులకు కూడా ఎంతో సహాయపడుతుంది. దీనిని పెదవులపై అప్లై చేయడం వల్ల పెదాలు అందంగా మెరిసిపోతాయి. అలాగే మృదువుగా తయారవుతాయి. ఇది చర్మాన్ని రక్షించడమే కాకుండా పొడి చర్మాన్ని కూడా తొలగిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల కలబంద జెల్ ను మీ పెదవులకు అప్లై చేయండి. రాత్రంతా అలాగే వదిలేయండి. ఉదయాన్నే చల్లటి నీటితో కడగడం వల్ల లిప్స్ పింక్ కలర్ లోకి మారుతాయి. అలాగే పొడి చర్మాన్ని (Dry skin) వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

66

విటమిన్ సి సమృద్ధిగా ఉండే నిమ్మకాయలు పొడిబారిన, నల్లటి పెదవులకు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇది నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొద్దిగా ఆముదం నూనె ను తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయండి. దీన్ని పగిలిన పెదాలకు అప్లై చేయండి. 10 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేయండి. 

click me!

Recommended Stories