కీరదోసకాయను ఈ సమయంలో అస్సలు తినకూడదు.. తింటే మీపని అంతే..

First Published Oct 8, 2022, 2:54 PM IST

కీరదోసకాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల బాడీ హైడ్రేట్ గా ఉండటంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 
 

కీరదోస ఔషదం కంటే తక్కువేం కాదు. అందుకే దీనిని అలాగే లేదా సలాడ్ రూపంలో తీసుకుంటారు. ఈ కూరగాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కీరాలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు, శరీరం తేమగా, రీఫ్రెష్ గా ఉండేందుకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది వడదెబ్బ కొట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీన్ని కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్ల చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ వదిలిపోతాయి. ఇవే కాదు దీనివల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయినప్పటికీ దీనిని ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఆరోగ్యానికి మంచిదికాదంటున్నారు నిపుణులు. మరి దీన్ని ఎప్పుడు తినాలో తెలసుకుందాం పదండి. 
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీరదోస ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దీనిని ఎప్పుడు కూడా పగటిపూటే తినాలి. దీనివల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఒకవేళ దీన్ని రాత్రిపూట తింటే ప్రయోజనం మాట అటుంచితే.. ఎంతో హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

కీరదోసకాయలో కుకుర్బిటాసిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ బలంగా ఉన్నప్పుడు మాత్రమే అరుగుతుంది. లేదంటే అజీర్థి సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది. నిజానికి కీరదోసకాయను రాత్రిపూట తినడం వల్ల కడుపు హెవీగా అనిపిస్తుంది. అంతేకాదు దీనివల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం, అజీర్థి వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని పగటిపూటే తినమని నిపుణులు సలహానిస్తున్నారు. 

కీరదోసకాయను రాత్రిపూట తినడం వల్ల రాత్రి సరిగ్గా నిద్రపోలేరు. ఎందుకంటే దీన్ని రాత్రి సమయంలో తినడం వల్ల కడుపు బరువుగా అనిపిస్తుంది. దీంతో పడుకోవడం, అటూ ఇటూ తిరగడానికి కూడా ఇబ్బందిగా అనిస్తుంది. ఇవే కావు ఇది గ్యాస్ సమస్యకు కూడా దారితీస్తుంది. దీనివల్ల కూడా రాత్రిళ్లు సరిగా నిద్ర ఉండదు. కీరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక రాత్రి టైంలో దీన్ని తింటే తెల్లవార్లూ టాయిలెట్ కు పోయి రావడమే సరిపోతుంది. ఇంకేముంది దీనివల్ల నిద్రంతా పాడవుతుంది. 

చాలా మంది ఆరోగ్య నిపుణులు కీరదోసకాయను పగటిపూట మాత్రమే తినాలని సలహానిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పగటి పూట దీన్ని తినడం వల్ల మీరు వేగంగా బరువు తగ్గుతారు. దీనిలో ఉండే 95 శాతం నీరు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారించగలదు. అలాగే ఎముకలను బలంగా చేస్తుంది. 

click me!