కాఫీతో ముఖం మెరిసిపోతుందిలా...!

First Published | Oct 8, 2022, 12:54 PM IST

మన చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి కూడా సహాయపడుతుందట. కాఫీ పొడి.. మన చర్మాన్ని ఎలా మెరుగుపరుస్తుందో... ఎలా అందంగా మెరిసిపోతుందో ఓసారి చూద్దాం...

coffee

కాఫీని ఇష్టపడని వారు చాలా అరుదు అని చెప్పొచ్చు.  ఉదయం లేవగానే పొగలు కక్కే కాఫీ తాగితే వచ్చే కిక్కే వేరు. అయితే.... ఈ కాఫీతో మన ఇంద్రియాలను మెరుగుపరచడమే కాదు.. మన చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి కూడా సహాయపడుతుందట. కాఫీ పొడి.. మన చర్మాన్ని ఎలా మెరుగుపరుస్తుందో... ఎలా అందంగా మెరిసిపోతుందో ఓసారి చూద్దాం...

coffee face pack

1.ఉబ్బిన కళ్లు..

చాలా మంది ఈ రోజుల్లో ఉబ్బిన్న కళ్లు వంటి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు కాఫీ పొడిని ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించవచ్చట. కాఫీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఉబ్బిన కళ్ళు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.
గ్రౌండ్ కాఫీని గోరువెచ్చని నీటిలో కలిపి, అందులో కాటన్ బాల్స్ ముంచి ఉబ్బిన ప్రదేశంలో రాయండి. ఇలా తరచూ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.

Latest Videos


coffee face pack

2.డార్క్ సర్కిల్స్...

డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గించడంలోనూ కాఫీ కీలక పాత్ర పోషిస్తుంది. అర టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌కి 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఆ పేస్ట్‌ని కంటి కింద నల్లటి వలయాలకు అప్లై చేయండి. దీన్ని 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా తరచుగా నల్లటి వలయాలకు కారణమయ్యే కళ్ల కింద రక్తం చేరడాన్ని నివారిస్తుంది. డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గిస్తుంది.

coffee face pack

3.మొటిమల సమస్యను తగ్గించడం...

మొండి మొటిమలను తగ్గించడంలో కాఫీ పొడి పని చేస్తుంది. స్కిన్ బాక్టీరియాతో పోరాడటానికి కాఫీని దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో కలిపి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. మీ ముఖంపై నెమ్మదిగా కాఫీ పొడిని రుద్దండి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి మొటిమలు సమస్యను తగ్గిస్తుంది.

ఇంట్లోనే ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్  బియ్యం పిండితో 3 టీస్పూన్ల కాఫీ కలపండి. 3 టీస్పూన్ల తేనె,  2 టీస్పూన్ల అలోవెరా జెల్, 2-3 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ జోడించండి. ప్యాక్‌ను 15 నిమిషాలు లేదా అది ఆరిపోయే వరకు ఉంచి, ఆపై సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.

4.ట్యాన్ తొలగించడం..

కాఫీలో ఉండే పాలీఫెనాల్స్ UV కిరణాల నుండి రక్షిస్తుంది. సూర్యరశ్మికి గురికావడం వల్ల ఏర్పడే ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. 1 టేబుల్ స్పూన్ కాఫీతో పాటు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. దీన్ని 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై శుభ్రం చేసుకోండి.
 

5.పొడి చర్మం

కాఫీ, ఆలివ్ ఆయిల్ రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

అర టీస్పూన్ కాఫీ పౌడర్‌కి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖమంతా అప్లై చేయాలి. మీరు పొడిగా ఉన్న ఇతర శరీర భాగాలపై కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీన్ని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి.
 

Face pack

6.పిగ్మెంటేషన్...
కాఫీ మాస్క్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల  మృదువైన, ప్రకాశవంతమైన, మచ్చలేని చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది. కాఫీ వల్ల కలిగే బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే, ఇది పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది.

అర టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, అర టేబుల్ స్పూన్ తేనె, సగం నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి. దీనిని రాయడం వల్ల పెదాల వద్ద ఉన్న పిగ్మెంటేషన్ ని కూడా తొలగించవచ్చు.

click me!