ఈ రోగాలుంటే కూడా డిప్రెషన్ కు గురవుతారు.. జాగ్రత్తగా ఉండండి..

First Published Oct 10, 2022, 10:00 AM IST

డిప్రెషన్ చావు వరకు కూడా తీసుకెళుతుంది. అందుకే డిప్రెషన్ బారిన పడుకుండా చూసుకోవాలి. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల రోగాలు కూడా డిప్రెషన్ బారిన పడేలా చేస్తాయి. 
 

మధుమేహం, ఆర్థరైటిస్, మూత్రపిండాల వ్యాధి వంటి దీర్ఘకాలిక రోగాల వల్ల కూడా ఒత్తిడి కలుగుతుంది. లైఫ్ స్టైల్, నాన్-కమ్యూనికబుల్ వ్యాధి ఉన్నవారిలో మూడింట ఒక వంతు మంది నిరాశతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేసుకోలేం. ఈ రోగాలే ఒక వ్యక్తి లైఫ్ స్టైల్ ను పూర్తిగా మారుస్తాయి. వీటివల్ల రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది కలుగుతుంది. ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇది కాస్త డిప్రెషన్ గా మారుతుంది. నిద్రలేమి, అలసట, ఏకాగ్రత లోపించడం, బరువు తగ్గడం లేదా బరువు పెరగడం, రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి లేకపోవడం వంటివి డిప్రెషన్ ప్రధాన లక్షణాలు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల రోగాలు కూడా డ్రిపెషన్ కు దారితీస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

డయాబెటిస్ మెల్లిటస్

టైప్ 2 డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. దీనివల్ల మీ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయి. ఇది ఇన్సులిన్  నిరోధకతకు దారితీస్తుంది. దీనివల్ల తరచుగా మూత్రం రావడం,  దాహం వేయడం, ఆకలి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

టైప్ 1 లేదా 2 డయాబెటిస్ ఉన్నవారు డిప్రెషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. మధుమేహం ఎన్నో అనారోగ్య సమస్యలను దారితీస్తుంది. ఇది నిరాశ లక్షణాలను మరింత దిగజార్చుతుంది. వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, బరువు పెరగడం,  ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారం తినడం వంటివి డిప్రెషన్ కు దారితీస్తాయి. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉన్నట్టైతే ఊరికే చిరాకు పడటం, విచారం, రోజూ చేసే పనులపై ఆసక్తి లేకపోవడం, ఏకాగ్రత లోపించడం, మూడ్ ఛేంజెస్, వెన్ను నొప్పి, తలనొప్పి వంటి  సమస్యలు కనిపిస్తాయి. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు. 
 

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు సాధారణంగా పెద్ద వయసు వారిలోనే వస్తుంటాయి. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి డిప్రెషన్, నొప్పి, లైంగిక సామర్థ్యం తగ్గడం, పనిలో ఏకాగ్రత లోపించడం, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
 

మూత్రపిండాల వైఫల్యం

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారిలో ఆందోళన, నిరాశ వంటి న్యూరోసైకియాట్రిక్ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మరణానికి కూడా దారితీస్తాయి. మూత్రపిండాల వైఫల్యంలో అత్యంత సాధారణ లక్షణాలలో డెలిరియం ఒకటి.

కార్డియాక్ అరెస్ట్

కార్డియాక్ అరెస్ట్ డిప్రెషన్ తో ముడిపడి ఉందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. 20 నుంచి 30% మంది ప్రజలు గుండె జబ్బుల కారణంగా డిప్రెషన్ బారిన పడుతున్నారట. ఈ సమస్యతో బాధపడేవారికి భయం, కోపం, నిరాశ, ఆందోళన వంటి భావాలు కలుగుతాయి. 
 


థైరాయిడ్

థైరాయిడ్ గ్రంధి థైరాయిడ్ హార్మోన్లను నియంత్రిస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అలాగే ఆందోళన లేదా నిరాశకు దారితీస్తుంది. థైరాయిడ్ అత్యంత సాధారణ లక్షణాలు.. ఏకాగ్రత లేకపోవడం, అలసట, బరువు పెరగడం, లిబిడో తగ్గడం. వీటికి తోడు థైరాయిడ్ వ్యాధి వంధ్యత్వంతో ముడిపడి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాలేయ సిర్రోసిస్, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, స్వయం ప్రతిరక్షక వ్యాధులు, నయం చేయలేని క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులే ఎక్కువగా నిరాశకు లోనవుతారని నిపుణులు చెబుతున్నారు. 
 

click me!