ఇమ్యూనిటీ పవర్ ను పెంచి .. రోగాలను దూరం చేసే బెస్ట్ ఫుడ్స్ ఇవే.. తప్పక తినండి..

First Published Oct 9, 2022, 4:59 PM IST

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే ఎలాంటి రోగాలు రావు. అయితే మన రోగనిరోధక శక్తిని వ్యాయామం, కొన్ని రకాల ఆహారాల ద్వారా పెంచుకోవచ్చు. 
 

ఆరోగ్యకరమైన జీవితానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఆహారం ద్వారే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాయామం చేస్తే కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే స్మోకింగ్ చేయకూడదు. ఆల్కహాల్ ను అతిగా తాగకూడదు. ముఖ్యంగా ఇంటిని, ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి. 
 

బాదం 

బాదం పప్పులు పోషకాల భాండాగారం. బాదంలో విటమిన్ ఇ, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. బాదం పప్పులు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడాయి. హార్ట్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. బాదం పప్పులు గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
 

పసుపు

ప్రతి ఇంట్లో పసుపు ఖచ్చితంగా ఉంటుంది. అసలు పసుపు లేని కూరలే ఉండవు. నిజానికి పసుపులో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. పసుపు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాదు అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులో కాల్షియం, ఫైబర్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండేవారు పసుపును రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 

అల్లం

అల్లంలో ఎన్నో ఔషదగులుంటాయి. దీన్ని మీ రోజు వారి ఆహారంలో చేర్చడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు అల్లం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా అల్లం సహాయపడుతుంది. 

విటమిన్ సి

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయన్న సంగతి అందరికీ తెలుసు.. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శీతాకాలంలో తినగలిగే విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలలో నారింజ ఒకటి. ద్రాక్ష, కివి పండ్లను తింటే కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 
 

పెరుగు

పెరుగును కాలాలతో సంబంధం లేకుండా రోజూ ఒక కప్పు తినొచ్చు. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, లాక్టిక్ యాసిడ్, జింక్, విటమిన్ డి, విటమిన్ బి2, విటమిన్ బి 12, విటమిన్ బి 5 సమృద్ధిగా ఉంటాయి. పెరుగు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పెరుగు జీర్ణక్రియను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుంది. 
 

guava

జామ

జామకాయ ఔషధ గుణాల భాండాగారం. ఎందుకంటే జామపండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. జామకాయం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ పండ్లు అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. జామకాయ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి  కూడా సహాయపడుతుంది. 

click me!