రాత్రిపూట పప్పు అన్నం తినే అలవాటు లేదా..? ఈ విషయం తెలిస్తే.. రోజూ అదే కావాలంటారు తెలుసా..

Published : Oct 09, 2022, 04:19 PM IST

దాల్ రైస్ అంటే పడిచచ్చేవారు చాలా మందే ఉన్నారు. వేడి వేడి అన్నంలో పప్పుతో తింటుంటే వచ్చే ఆ మజాయే వేరు. కానీ కొంతమందికి ఇలా తినడం అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటి వారికి ఈ విషయం తెలిస్తే ప్రతిరోజూ పప్పు అన్నమే కావాలంటారు..   

PREV
15
రాత్రిపూట పప్పు అన్నం తినే అలవాటు లేదా..? ఈ విషయం తెలిస్తే.. రోజూ అదే కావాలంటారు తెలుసా..

అన్నం, పప్పు చారు తినని వారు ఎక్కడ వెతికినా దొరకరమే.. ఒక్కసారి ఈ రుచికి అలవాటు పడితే ఎవ్వరైనా రోజూ ఇదే కావాలంటారు. అయితే పప్పుల ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దాల్ రైస్ లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, ఫైబర్, విటమిన్ బి1 , యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంది పప్పును తినడం వల్ల మీ శరీరానికి విటమిన్ సి, విటమిన్ డి, విటమినె కె లు అందుతాయి. అలాగే అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. 
 

25

అన్నం పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రాత్రి పూట అన్నంలో పప్పు చారు వేసుకుని తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. తేలిక పాటి ఆహారం తినడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఫిట్ నెస్ ను ఇష్టపడేవారు రాత్రి పూట పప్పు అన్నం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 
 

35


పొట్టకు సంబంధించిన సమస్యలున్నవారు పక్కాగా రాత్రిపూట పప్పు అన్నం తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది జీర్ణసమస్యలను పోగొడుతుంది. ఏదైనా తిన్నతర్వాత  కడుపులో మంట పుడితే పప్పు అన్నం తినండి. వెంటనే ఉపశమనం పొందుతారు. 

45

పప్పు, బియ్యం బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. వీటిలో ప్రోటీన్ తో పాటుగా ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్న తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినాలన్న కోరిక తగ్గుతుంది. జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. అలాగే కేలరీలు బర్న్ చేయడం సులువు అవుతుంది. ఈ దాల్ రైస్ అజీర్థి, మలబద్దకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

55

ఈ పప్పు అన్నంలో కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను, కండరాలను బలంగా చేస్తాయి. దీనిలోని కాల్షియం దంతాలను బలోపేతం చేస్తుంది. అయితే పప్పు అన్నం తినేటప్పుడు అన్నం కంటే పప్పే ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. అప్పుడే దీని ప్రయోజనాలను పొందుతారు. 

Read more Photos on
click me!

Recommended Stories