World Menstrual Hygiene Day 2022 : పీరియడ్స్ సమయంలో ఈ విషయాలను అస్సలు మర్చిపోకూడదు..

Published : May 27, 2022, 04:10 PM IST

World Menstrual Hygiene Day 2022 : కాలం మారుతున్నా పీరియడ్స్ గురించి చాలా మందికి ఎన్నో అపోహలున్నాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు మే 28 న ప్రపంచ ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

PREV
111
World Menstrual Hygiene Day 2022 : పీరియడ్స్ సమయంలో ఈ విషయాలను అస్సలు మర్చిపోకూడదు..

రుతుస్రావం అనేది స్త్రీ శరీరంలో ఒక సహజ ప్రక్రియ. కానీ ఈ సమయంలో మహిళల పరిస్థితి అంత బాగోదు. ఈ పీరియడ్స్ సమయంలో కొందరికీ ఎలాంటి సమస్యలు కలగకపోయినా.. మరికొంతమందికి మాత్రం పొత్తి కడుపునొప్పి, తీవ్రమైన రక్తస్రావం, నడుము నొప్పి, కాళ్లు చేతులు లాగడం, వాంతులు, వికారం, నీరసం వంటి ఎన్నో సమస్యలు కలుగుతాయి. కానీ ఇలాంటి సమయంలోనే ఆడవారు మరింత పరిశుభ్రతను పాటించాలి. 

211

రేపు మే 28న ప్రపంచ ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం. రుతుస్రావ పరిశుభ్రత గురించి చాలా మందికి ఇప్పటికీ స్పష్టమైన ఆలోచన లేదు. రుతుస్రావ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం మరియు దానితో సంబంధం ఉన్న అపోహలను తొలగించడం లక్ష్యంగా ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవాన్ని ( World Menstrual Hygiene Day) జరుపుకుంటారు.
 

311

ప్రపంచ ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం 2022 యొక్క థీమ్.."2030 నాటికి రుతుస్రావం కారణంగా మహిళలు లేదా బాలికలు వెనక్కి తగ్గని ప్రపంచాన్ని సృష్టించడం"  .  ఈ రోజు రుతుస్రావ రక్షణ యొక్క ప్రాముఖ్యతను  తెలియజేస్తుంది. రుతుస్రావం సమయంలో మహిళలు ఎదుర్కొనే సామాజిక సమస్యల గురించి కూడా ఈ రోజున అవగాహన కల్పిస్తారు. 

411

రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవాన్ని మొదటిసారిగా 2013లో జర్మన్ నాన్ ప్రాఫిట్  వాష్ యునైటెడ్ రూపొందించింది. దీనిని 2014  నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజును జరుపుకుంటున్నారు.  గత మూడు సంవత్సరాలుగా, ప్రపంచ రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం ఉద్యమం #ItsTimeForAction అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి రుతుస్రావ ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై చర్య తీసుకోవాలని పిలుపునిచ్చింది.

511

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి రుతుస్రావ ఆరోగ్యం మరియు పరిశుభ్రతను పెంపొందించడానికి ఈ రోజును జరుపుకుంటారు. రుతుస్రావం ఆరోగ్యం మరియు పరిశుభ్రత గురించి అవగాహన పెంచడం, దీనిపై ఉన్న ప్రతికూల సామాజిక నిబంధనలను మార్చడం ఈ రోజు లక్ష్యం.

611

రుతుస్రావ పరిశుభ్రత కోసం గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి...

ఋతుస్రావం అయిన తర్వాత తరచుగా ప్లాడ్ లను తరచుగా మార్చుకుంటూ ఉండాలి. ఇది ఎన్నో అంటువ్యాధులతో సహా ఇతర వ్యాధులను కలిగిస్తుంది. కాబట్టి ప్యాడ్ లను ఎక్కువ సేపు ఉపయోగించవద్దు.
 

711

స్కూలుకు వెళ్లే పిల్లలు లో దుస్తులను, ఎక్కువ ప్యాడ్ లను తీసుకెళ్లాలి. ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారైనా ప్యాడ్ ని మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

811

మీ పీరియడ్స్ సమయంలో మీ ప్రైవేట్ భాగాలను శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రమైన నీటితో కడగాలి. లేదంటే ఇన్ఫెక్షన్ బారిన పడతారు. 
 

911

శానిటరీ న్యాప్కిన్లను తొలగించడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. ఉపయోగించిన ప్యాడ్ లను గట్టి కవర్ లో చుట్టి పారేయాలి. వాటిని స్టోర్ చేయడం మంచిది కాదు. 

1011

రుతుస్రావం సమయంలో ప్రైవేట్ భాగాలకు దగ్గరగా ఉన్న వెంట్రుకలను తొలగించడం ఉత్తమం. లేదంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

1111

రుతుస్రావం సమయంలో మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ఈ సమయంలో జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు.  పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్నితినాలి. కాకపోతే ఇది శరీరంలో పోషకాల వ్యక్తీకరణకు దారితీస్తుంది. రుతుస్రావం సమయంలో నొప్పిని కలిగిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories