బరువు తగ్గాలా..? ఒంట్లో కొవ్వు కరిగించాలా..? రెండింటికీ చాలా తేడా ఉంది..!

Published : May 27, 2022, 03:14 PM IST

మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారా లేదంటే... శరీరంలో కొవ్వు తగ్గించాలని అనుకుంటున్నారా అనే విషయంలో క్లారిటీ ఉండాలట. ఎందుకంటే ఈ రెండింటిలో చాలా తేడా ఉందట

PREV
15
 బరువు తగ్గాలా..? ఒంట్లో కొవ్వు కరిగించాలా..?  రెండింటికీ చాలా తేడా ఉంది..!
weight loss

ఈ రోజుల్లో బరువు తగ్గాలని అనుకునేవారు చాలా మందే ఉన్నారు. ఆ బరువు తగ్గించుకునేందుకు  చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ముఖ్యంగా తిండి తినడం మానేస్తారు. ఇక వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేయడం మొదలుపెడతారు. వారికి తోచిన ప్రతి ఒక్కటీ చేస్తుంటారు. అయితే... ఇవన్నీ చేయడానికి ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి.

25

మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారా లేదంటే... శరీరంలో కొవ్వు తగ్గించాలని అనుకుంటున్నారా అనే విషయంలో క్లారిటీ ఉండాలట. ఎందుకంటే ఈ రెండింటిలో చాలా తేడా ఉందట. అసలు ఈ రెండింటిలో ఏది అవసరమో.. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..

35

ప్రముఖ పోషకాహార నిపుణుడు అజ్రా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయం పై స్పందించారు. వీడియోలో, మీరు బరువు తగ్గితే, మీరు కొవ్వు, కండరాల బరువు, నీటి బరువు మొదలైనవాటిని కోల్పోతారని చెప్పారు. అలా కాకుండా.. మీరు ఇంచ్ లాస్ అయితే.. నిజంగా మీరు శరీరంలోని కొవ్వును కోల్పోతారట.

45

శరీర బరువు తగ్గడం కంటే.. కొవ్వును కోల్పోవడం ఆరోగ్యానికి మంచిదని.. ఎంతో ఉపయోగకరమని వారు చెప్పారు. కాబట్టి.. బరువు ఎలా తగ్గాలి అనే దాని కంటే... ఇంచ్ లాస్ ఎలా అవ్వాలి..? కొవ్వు ఎలా తగ్గించాలి అనే విషయం పై ఎక్కువ దృష్టి పెట్టాలని వారు చెప్పార.

55

చాలా మంది తాము చాలా ఎక్కువగా కసరత్తులు చేస్తున్నామని అయినా బరువు తగ్గడం లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే.. మనం రాత్రి చేసిన భోజనం, పీరియడ్స్, ధరించిన దుస్తులు కూడా వాటికి కారణమౌతాయట. కాబట్టి... రాత్రి భోజనం చాలా లైట్ గా ఉండాలని చెప్పారు. శరీరంలో కొవ్వు ఎంత తగ్గిందనే విషయాన్ని బీఎంఐ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. శరీరంలో కొవ్వు తగ్గించుకుంటూ పోతే.. బరువు కూడా సులభంగా తగ్గుతారని  ఆయన చెప్పారు.

click me!

Recommended Stories