Weight gain: బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే వీటిని తినండి..

Published : May 27, 2022, 03:23 PM ISTUpdated : May 27, 2022, 03:24 PM IST

Weight gain: కొంతమంది అధిక బరువుతో బాధపడితే.. మరికొంతమంది మాత్రం తక్కువ బరువుతో బాధపడుతున్నారు. అయితే  బరువు తక్కువగా ఉన్నవాళ్లు కొన్ని రకాల పండ్లను తింటే ఒంటికి కండ పడుతుంది. 

PREV
16
Weight gain: బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే వీటిని తినండి..

వయసుకు, ఎత్తుకు తగ్గ బరువుంటేనే చూడటానికి బాగుంటుంది. అందులోనూ మన బరువే మన ఆరోగ్యం ఎలా ఉందో తెలియజేస్తుంది. కాగా ఈ రోజుల్లో కొంతమంది ఊబకాయంతో బాధపడితే.. మరికొంత మంది మాత్రం మేంము బరువు తక్కువగా ఉన్నామని బాధపడుతున్నారు. 

26

బరువు తక్కువున్నా.. మరీ ఎక్కువగా ఉన్నా.. మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అధిక బరువు వల్ల ఎలా అయితే అనారోగ్య సమస్యలు వస్తాయో.. అలాగే బరువు తక్కువగా ఉంటే కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. బరువు తక్కువగా ఉన్నారంటే.. మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతలేవని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారు కొన్ని పండ్లను తింటే సులువుగా బరువు పెరుగుతారు. అంతేకాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. 

36

బనానా షేక్.. బనానా షేక్ బరువు పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం మీరు ముందుగా చేయాల్సింది.. పాలను 150 మిల్లీ లీటర్లు తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల శెనగపిండిని వేయండి. ఆ తర్వాత రెండు అరటి పండ్లను వేసి షేక్ ను తయారుచేసుకుని తీసుకోండి. దీనిని మీరు రోజూ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల మీ శరీరానికి శక్తి లభించడంతో పాటుగా కేలరీలు కూడా అందుతాయి. దీనిని క్రమంగా తాగడం వల్ల మీలో వచ్చే ఛేంజెస్ చూసి ఆశ్చర్యపోతారు. 

46

ఖర్జూరం, పాలు.. ఖర్జూరాలు, పాలు కూడా మీరు బరువు పెరగడానికి ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం మీరు కొన్ని ఖర్జూరాలను తీసుకుని మూడు నుంచి నాలుగు గంటల పాటు పాలలో నానబెట్టండి. వీటిని కాస్త వేడి వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఖర్జూరాలను తినాలి. అలాగే పాలను తాగేయండి. దీనివల్ల బలహీనంగా ఉన్న మీరు బలంగా తయారవుతారు. అలాగే బరువు కూడా పెరుగుతారు. 

56

గుడ్లు.. గుడ్లు సంపూర్ణ ఆహారం. రోజుకు ఒక గుడ్డు తింటే ఎలాంటి జబ్బులు రావని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ గుడ్లు మీరు  బరువు పెరగడానికి కూడా సహాయపడతాయి. ఒక మామూలు సైజు కోడి గుడ్డులో కొవ్వు 5 గ్రాములు, ప్రోటీన్ 6 గ్రాములు, కేలరీలు 77 ఉంటాయి. వీటిని తినడం వల్ల మీ శరీరానికి కావాల్సిన కేలరీలు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీరు బరువు పెరగడానికి సహాయపడతాయి. బ్రౌన్ బ్రెడ్ తో గుడ్డును తిన్నా చాలా తొందరగా బరువు పెరుగుతారు. 

66

చీజ్, బ్రౌన్ బ్రెడ్.. చీజ్ బరువు పెరగడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతుంటారు.  క్రమం తప్పకుండా కాస్త చీజ్ ను తీసుకుని బ్రౌన్ బ్రెడ్ తో కలిపి తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన కేలరీలు లభిస్తాయి. దీంతో మీరు చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. 

Read more Photos on
click me!

Recommended Stories