మన తాతలు, ముత్తాతలు వారి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు.. ఎందుకంటే వారి ఆరోగ్యం బేషుగ్గా ఉండేది. ఎందుకంటే వారు పోషకాహారమే తీసుకునే వారు. అందుకే వాళ్లు నూరేండ్లేంటి.. నూటయాభై ఏండ్లు కూడా బతికారు. ఇక ఇప్పుడు 60, 70 ఏండ్లు బతకడమే మహా ఎక్కువ. ఎందుకంటే మన ఆరోగ్యం అంత తొందరగా క్షీణిస్తుంది కాబట్టి. దీనికంతటికీ కారణం మనం తినే ఆహారమే మరి. అవును మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలుసు.. అయినా ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాన్నే తినేవారున్నారు. దీంతో లక్షలు, కోట్లు పెట్టినా.. నయం కానీ జబ్బుల బారిన పడుతున్నారు. మీకు తెలుసా..? ప్రకృతిమనకు ప్రసాదించిన వాటిని తీసుకుంటే చాలు.. మీరు నూరేళ్లు ఎలాంటి రోగాలు లేకుండా బతుకుతారు. ఇలాంటి ఆరోగ్యకరమైన వాటిలో కొబ్బరి కూడా ఉంది.