టీచర్స్ డే 2022 : మీ టీచర్స్ కు ఇవ్వడానికి బెస్ట్ గిఫ్ట్స్ ఇవే..

First Published Sep 2, 2022, 10:54 AM IST

టీచర్స్ డే: టీచర్స్ డే ఈ నెల 5 తారీఖే. మరీ ఈ సందర్బంగా మీ టీచర్లకు ఎలాంటి బహుమతులు ఇద్దామనుకుంటున్నారు. ఏమి ఇవ్వాలో తోచడం లేదా... అయితే ఇక్కడ గిఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి.. చూసేయండి.. 

మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే.. వారు ఒక్క ఉపాధ్యాయులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్లే మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది. అలాంటి గురువు రుణం మనం ఏం చేసినా తీర్చుకోలేం. అందుకే ఈ సెప్టెంబర్ 5 న ఉపాద్యాయుల దినోత్సవం కాబట్టి వారిని గౌరవించండి. వారిపై ఉన్న ఇష్టాన్ని తెలియిజేయండి. మరి విద్యార్థులు ఉపాధ్యాయులకు ఎలాంటి బహుమతులు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేయాలో తెలుసుకుందాం పదండి.. 
 

కాఫీ మగ్

టీచర్స్ డే నాడు.. మీ టీచర్స్ పై ఉన్న అభిమానాన్ని రాసి తెలియజేసేందుకు మార్కెట్ లో ఎన్నో రకాల కాఫీ మగ్ లు అందుబాటులో  ఉంటాయి. ఈ మగ్ పై మీ ఫోటో, మీ టీచర్ ఫోటోను  ప్రింట్ చేయించి ఇస్తే.. మీ టీచర్స్ మరింత ఆనందంగా ఫీలవుతారు. ఇలాంటి కాఫీ మగ్ లు 200 నుంచి 300 రూపాయల వరకు ఉంటాయి. 
 

స్టేషనరీ( పెన్ను లేదా డైరీ మొదలైనవి)

టీచర్ కు ఇవ్వడానికి పెన్ను, డైరీ కంటే గొప్పవి ఏముంటాయి చెప్పండి. టీచర్స్ కు పెన్నులు ఎప్పుడూ అవసరమే. అందుకే ఈ టీచర్స్ డే సందర్బంగా మీరు మీ టీచర్స్ కు పెన్నులు, స్టేషనరీ సెట్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. వీటితో పాటుగా ఒక అందమైన డైరీని కూడా ప్రజెంట్ చేయొచ్చు. డైరీలో తమ జీవితంలోని విషయాను రాసుకుంటారు. ఇది మిమ్మల్ని వారికి ప్రతి క్షణం గుర్తుచేస్తుంది. ఇవి కాకుండా మీ టీచర్ కు డ్రాయింగ్ వేయడం ఇష్టముంటే రంగు రంగుల బ్రష్ సెట్స్ ను, కలర్స్ ను కూడా ఇవ్వొచ్చు. వీటికి 200 నుంచి 300 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 
 

గ్రీటింగ్ కార్డ్స్

టీచర్స్ కు ఇవ్వడానికి గ్రీటింగ్ కార్డ్స్ కూడా మంచి ఆప్షనే. అయితే దీనిని మీ చేతితో తయారుచేస్తే మీ టీచర్ మరింత హ్యాపీగా ఫీలవుతుంది. మీ అందమైన చేతిరాతతో ఈ కార్డును తయారుచేసి.. దానిపై మీ టీచర్ ఫోటోను అతికించి ఇవ్వండి. 

మొక్క

మొక్కలే జీవనాధారం. అందుకే ఇవి అంటే అందరికీ ఇష్టముంటుంది. ఒకవేళ మీ టీచర్స్ కు మొక్కలు ఇష్టముంటే.. దీన్నే బహుమతిగా ఉవ్వండి. ఆ మొక్కను చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు. గులాబీ లేదా పండ్ల మొక్క లేదా మనీ ప్లాంట్ వంటి రకరకాల మొక్కలను ఇవ్వొచ్చు. ఈ మొక్కల ధర 200 నుంచి 300 వరకు ఉంటుంది. 
 

పుష్పగుచ్చం

మీ టీచర్ కు ఏ బహుమతి ఇవ్వాలో తెలియనప్పుడు.. ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు టీచర్స్ కు పుష్పగుచ్ఛంను ఇస్తారు. దీనికి మీరు పెద్దగా ఖర్చుకూడా పెట్టాల్సిన అవసరం లేదు. 200 నుంచి 300 రూపాయల వరకు ఇవి లభిస్తాయి.
 

click me!