నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022:కీటో డైట్ లో వీటిని తింటే..ఫాస్ట్ గా బరువు తగ్గడమే కాదు ఎన్నో రోగాలు తొలగిపోతాయి

First Published Sep 2, 2022, 9:58 AM IST

నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022:  ప్రస్తుతం కాలంలో కీటోజెనిక్ ఆహారం పట్ల జనాలకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ కీటో డైట్ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషస్తుంది. 
 

keto diet

బరువును తగ్గించడం నుంచి.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం వరకు ఎన్నో జబ్బులను పోగొట్టి.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీటో డైట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్ గా కూడా ఉంచుతుంది. అధిక కొవ్వు, తక్కువ కార్బ్ గల ఆహారం కొన్ని రకాల క్యాన్సర్లను, ఆల్జీమర్స్ వంటి ఎన్నో వ్యాధులను నయం చేయడానికి సహాయపడతుందని నిరూపించారు కూడా. అయినప్పటికీ.. దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. 

ఇక కీటో డైట్ లో సాధారణంగా పిండి పదార్థాలను రోజుకు 20 నుంచి 50 గ్రాముల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కీటో డైట్ ను ఫాలో అవ్వడం కష్టంగా అనిపించినప్పటికీ.. దీనిలో మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. మరి ఈ కీటో డైట్ లో ఎలాంటి ఆహారాలను తప్పకుండా తినాలో తెలుసుకుందాం పదండి.. 

సీఫుడ్స్

షెల్ఫిష్, చేపలు, సాల్మన్ వంటి ఇతర చేపల్లో కార్బ్ మొత్తమే ఉండదు. వీటిలో పుష్కలంగా సెలీనియం, విటమిన్ బి, పొటాషియం ఉంటాయి. అయితే పీతలు, రొయ్యల్లో పిండి పదార్థాలు ఉండవు. అందుకే కీటో డైట్ ను ఫాలో అయ్యేవారు ఈ ఆహారాలను బేషుగ్గా తినొచ్చు. 

మాకేరెల్, సాల్మన్, సార్డినెస్ వంటి కొవ్వు చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్కువ ఇన్సులిన్ స్థాయిలో ముడిపడి ఉంది. ఊబకాయం, అధిక బరువుతో బాధపడేవారికి ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. తరచుగా ఈ చేపలను తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. 18 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు వారానికి 8 నుంచి 10 ఔన్సుల సీఫుడ్ తినాలని వెల్లడించింది. 
 

మాంసం, పౌల్ట్రీ

కీటో డైట్ లో పౌల్ట్రీ, మాంసాహారాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఫ్రెష్ పౌల్ట్రీ, మాంసంలో పిండిపదార్థాలు ఉండవు. వీటిలో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటుంది. తక్కువ కార్బ్ ఉన్న ఈ ఫుడ్స్ కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే ఈ డైట్ లో గడ్డిని తినే జంతువుల మాంసాన్నే తినడం ఉత్తమం. ఎందుకంటే ధాన్యం పెట్టిన జంతువుల మాంసం కంటే వీటిలోనే ఒమేగా 3 కొవ్వులు, సంయోగ లినోలిక్ ఆమ్లం ఉంటాయి. 
 

గుడ్లు

గుడ్లు మంచి ప్రోటీన్ వనరు. ఎందుకంటే ఒక పెద్ద గుడ్డులో పిండిపదార్థాలు 1 గ్రాము కంటే తక్కువగా ఉంటాయి. ఇక 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే కీటో డైట్ ఫాలో అయ్యేవారికి గుడ్డు బెస్ట్ అనే చెప్పాలి. పలు అధ్యయనాల ప్రకారం.. గుడ్లను తినడం వల్ల హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. గుడ్డులోని పచ్చసొనలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే కేవలం తెల్లసొనే కాకుండా.. మొత్తం గుడ్డును తినండి. దీనిలో జియాక్సంతిన్, యాంటీ ఆక్సిడెంట్లు, లుటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే  గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని ఇప్పటి వరకు ఎలాంటి పరిశోధనలు తెలుపలేదు. 

జున్ను

జున్నులో ఎన్నో రకాలున్నాయి. వీటిలో చాలా వరకు పిండిపదార్థాలు చాలా తక్కువగా, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇవి కీటో డైట్ కు బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. 28 గ్రాముల చెడ్డార్ చీజ్ లో పిండిపదార్థాలు 1 గ్రాము, 6 గ్రాముల ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 

జున్నులో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని ఎలాంటి అధ్యయనాలు ఇప్పటివరకు చెప్పలేదు. నిజానికి కొన్ని అధ్యయనాలైతే ఇలాంటి సమస్యలను తగ్గించడానికి ఇది ఎంతో సహాయపడుతుందని సూచించాయి కూడా. జున్ను శరీర పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. జున్నును కొంతమొత్తంలో రోజూ తినడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే కండరాల బలహీనత, శరీర బలహీనతలు తగ్గిపోతాయి.  

click me!