దేశమంతటా చలి ఊపందుకుంది. ఈ చల్లని గాలులకు ఇండ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. చలికాలంలో ఇంట్లో వెచ్చగా ఉంటే సరిపోదు. మీ ఒళ్లు కూడా వెచ్చగా ఉండాలి. అందుకే ఈ చలికాలంలో వేడెక్కే సూట్లు, స్వెట్టర్లను ఎక్కువ వేసుకుంటుంటారు. వీటితో పాటుగా కొన్ని రకాల ఆహారాలు కూడా కూడా శరీర ఉష్ణోగ్రతను పెంచేందుకు సహాయపడతాయి. చలికాలంలో పోషకాలను ఎక్కువగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే మీ శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. నిజానికి చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీనివల్లే ఎన్నో రోగాలొస్తయ్. మన రోగనిరోధక శక్తిని, బాడీ టెంపరేచర్ ను పెంచడానికి కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..