చలికాలంలో వేడినీటితో స్నానం చేస్తే.. వీర్యకణాలు తగ్గడంతో పాటుగా ఆ సమస్యలు కూడా వస్తయ్ జర జాగ్రత్త..

First Published Dec 12, 2022, 3:00 PM IST

చలికాలంలో చాలా మంది వేడినీటితోనే స్నానం చేస్తుంటారు.  కానీ చలికాలంలో మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే.. బీపీ పెరగడం నుంచి నపుంసకత్వం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలుసా..? 

చలికాలంలో చన్నీటి స్నానం అస్సలు మంచిది కాదు. అయినా చలికి చాలా మంది రెగ్యులర్ గా స్నానం చేయరు. రోజు తప్పించి రోజో లేదా రెండు రోజులకోసారో చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం క్రమం తప్పకుండా స్నానం చేస్తుంటారు. రోజూ స్నానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ సీజన్ లో దాదాపుగా ప్రతిఒక్కరూ వేడినీటితోనే స్నానం చేస్తుంటారు. చల్లని వాతావరణంలో వేడి నీరు శరీరంపై పడినప్పుడు.. మంచి అనుభూతి కలుగుతుంది. అందుకే వేడినీళ్లతో స్నానం ఎక్కువ సేపు చేస్తారు. కానీ చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యం దెబ్బతింటుంది. వేడినీటి స్నానం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది

వేడి నీటితో క్రమం తప్పకుండా స్నానం చేయడం అంత మందిది కాదు. ఇలా స్నానం చేసే పురుషుల్లో వీర్యకణాలు వేడెక్కడంతో పాటుగా 4 నుంచి 5 వారాల్లో స్పెర్మ్ కౌంట్ బాగా కూడా తగ్గిపోతుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు. ఇది పురుషులలో నపుంసకత్వం ప్రమాదాన్ని పెంచుతుంది.
 

దురద

మరీ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. దురద కూడా పెడుతుంది. అంతే కాదు చాలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని తేమ తొలగిపోయి చర్మం పొడిబారి గరుకుగా మారుతుంది.

కంటి ఇన్ఫెక్షన్లు 

మరీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి. ఇది కంటి గాయాల నుంచి థర్మల్ నెక్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. సమస్య ఎక్కువైతే అంధత్వం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతుంది. 

జుట్టు సమస్యలు

ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, పోషకాల లోపం, చుండ్రు వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు దెబ్బతింటుంది. జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువ వేడిగా ఉండే నీటితో జుట్టును కడగడం వల్ల నెత్తిమీద చర్మం కాలిపోతుంది. చుండ్రు, దురద, చికాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. 
 

high blood pressure

రక్తపోటు పెరుగుతుంది

చాలా వేడిగా ఉండే నీటితో స్నానం చేసేవారికి కూడా రక్తపోటు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అధిక రక్తపోటు పేషెంట్లు వేడి నీటితో స్నానం చేయకూడదు. అంతే కాదు వేడి నీటితో స్నానం చేయడం వల్ల కార్డియో, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కాబట్టి మన శరీర ఉష్ణోగ్రత కంటే.. 5 డిగ్రీల కంటే ఎక్కువ వెచ్చగా నీటిని తీసుకోవాలి. అంటే మీరు 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వేడి నీటితో స్నానం చేయవచ్చు. కానీ ఈ నీటిని 60-70 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తే అది శరీరానికి అనేక సమస్యలను కలిగిస్తుంది.

click me!