చలికాలంలో చర్మం, జుట్టు, గోళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో వీటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి , జుట్టును బలోపేతం చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్ లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరు ఇంటి చిట్కాలను ఫాలో అవుతారు. మరికొందరు రెగ్యులర్ గా పార్లర్ కు వెళుతుంటారు. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నేం చేయక్కర్లేదు తెలుసా.?
చర్మ సమస్యలు, పాదాల పగుళ్లు, జుట్టు గరుకుదనం లేదా చుండ్రు వంటి సమస్యలు ఈ సీజన్ లో ఎక్కువగా వస్తుంటాయి. కొంతమందికి కీళ్ల నొప్పులు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటినీ వదిలించుకోవడానికి ఆవనూనెను ఎంతో సహాయపడుతుంది. చలికాలంలో ఆవనూనెను వాడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..