చలికాలంలో మెంతికూరను తింటే ఇంత మంచిదా?

First Published Dec 20, 2022, 9:44 AM IST

మెంతి ఆకులను సూపర్ ఫుడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ సీజన్ లో దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండటం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. 

చలికాలంలో ఆరోగ్యం పట్ల ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. నాకేమైతుందిలే అని లైట్ తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావొచ్చు. మనం ఆరోగ్యంగా ఉండటానికి పరిశుభ్రత ఎంత ముఖ్యమో.. తీసుకునే ఫుడ్ కూడా అంతేముఖ్యం. కాగా ఈ సీజన్ లో ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఎందుకంటే వీటిలో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడతాయి.  ఇలాంటి ఆకు కూరల్లో మెంతిఆకులు ఒకటి. మెంతిఆకులను మెంతి పరాటా, ఆలూ మెంతి, చికెన్ మెంతి వంటి ఎన్నో కూరల్లో వేస్తుంటారు. ఈ వంటకాలు ఆరోగ్యకరమైనవి కూడా. నిజానికి మెంతి ఆకుల్లో ఎన్నో పోషకాలుంటాయి. అందుకే దీన్ని శీతాకాలపు సూపర్ ఫుడ్ అంటారు. 

fenugreek

చలికాలంలో మెంతికూరను ఎందుకు తినాలి? 

మెంతిఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారకాలు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ఈ సీజన్ లో మెంతిఆకులను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

weight loss

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బరువు తగ్గాలనుకునే వారికి మెంతులు, మెంతి ఆకులు బాగా ఉపయోగపడతాయి. మెంతి విత్తనాలు, ఆకులలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను ప్రోత్సహించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇవి ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకునే వారికి సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. మెంతిలోని డైటరీ ఫైబర్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రోజులో మీరు హెవీగా తినే అవకాశాలు తగ్గుతాయి. 

మధుమేహాన్ని నియంత్రిస్తుంది

మెంతికూరలో డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ఇది కార్బోహైడ్రేట్లు, చక్కెర శోషణను మరింత నియంత్రిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇన్సులిన్ నిరోధకతను పరిష్కరించడానికి ఇది చక్కగా సహాయపడుతుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు మెంతులను లేదా మెంతి ఆకులను ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 
 

cholesterol and heart

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

మెంతి ఆకులల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని విషాన్ని బయటకు పంపడానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ కారకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. 

acid reflux

యాసిడ్ రిఫ్లక్స్ ను నివారిస్తుంది

డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మెంతి ఆకుకూరలు ప్రేగు కదలికను నియంత్రించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇది గుండెల్లో మంటను, యాసిడ్ రిఫ్లక్స్ ను నివారించానికి  కూడా ఎంతగానో సహాయపడుతుంది.
 

చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

మెంతి ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. అలాగే జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ జుట్టు ఊడిపోయే ప్రసక్తే ఉండదు. అలాగే మీ జుట్టు బలంగా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. చుండ్రు సమస్య తొలగిపోతుంది. చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. 

మెంతి ఆకుల వినియోగం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ సీజన్ లో వీటిని తప్పకుండా వాడండి. అలాగని వీటిని మోతాదుకు మించి వాడటం మంచిది కాదు. ఇదొక్కటే కాదు.. ఏదైనా అంతే.. అతిగా వాడితే అనర్థాలు తప్పవు మరి. 
 

click me!