యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు దూరంగా ఉండాలంటే.. ఇలా చేయండి..

First Published Dec 19, 2022, 4:55 PM IST

నీటిని పుష్కలంగా తాగితే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యుటిఐ)  వంటి ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆడవాళ్లు తరచుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యుటిఐలు) తో బాధపడుతున్నారు. సరైన పరిశుభ్రత లేకపోవడం నుంచి డీహైడ్రేషన్ వరకు ఎన్నో కారణాల వల్ల యుటిఐ సమస్య తలెత్తుతుంది. శరీరంలో నీరు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలకు ఇదే ప్రధాన కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు యుటిఐని దూరంగా ఉంచడానికి నీరు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. డీహైడ్రేషన్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీనివల్ల మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృద్ధ మహిళలకు డీహైడ్రేషన్ వల్లే యుటిఐ సమస్య రావడం ఒక సాధారణ కారణమని అధ్యయనం వెల్లడిస్తోంది. డీహైడ్రేషన్ యుటిఐకి ఎలా కారణమవుతుందో తెలుసుకునే ముందు అసలు ఈ ఇన్ఫెక్షన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

urinary

యుటిఐ అంటే ఏమిటి?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగంలో సంక్రమణే యుటిఐ. అంటే మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం, మూత్రనాళం. చాలా రకాల అంటువ్యాధులు దిగువ మూత్ర మార్గంలోనే కనిపిస్తాయి. అంటే మూత్రాశయం , మూత్రనాళంలో అన్నమాట. పురుషులతో పోలిస్తే మహిళలే యుటిఐలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. ఎందుకంటే మహిళలకు తక్కువ మూత్రనాళాలు ఉంటాయి కాబట్టి. 
 

urinary infection

యుటిఐ మీ మూత్రపిండాలకు వ్యాపిస్తే ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే యుటిఐ మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చలి, జ్వరం, పార్శ్వ నొప్పి వంటివి నిర్జలీకరణం వల్ల కలిగే యుటిఐ లక్షణాలు. అందుకే నీటిని పుష్కలంగా తాగాలి. సమస్య తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

యుటిఐల లక్షణాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, బాధాకరమైన మూత్రవిసర్జన, క్లౌడీ యూరిన్, మూత్రం ఎరుపు లేదా గులాబీ రంగులో కనిపించడం, వాసన మూత్రం, కటి నొప్పి యుటిఐ కి కొన్ని సాధారణ లక్షణాలు. ఈ లక్షణాలు మీలో ఉంటే వైద్యుడిని తప్పకుండా సంప్రదించండి. హైడ్రేటెడ్ గా ఉండటానికి, యుటిఐలను దూరంగా ఉంచడానికి పుష్కలంగా నీటిని, ఇతర ద్రవాలను తాగాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 
 

నీళ్లు మహిళల్లో యుటిఐలను ఎలా నిరోధించగలదు?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తాడునీరు మూత్రాన్ని పలుచగా చేస్తుంది. నీళ్లను పుష్కలంగా తాగడం వల్ల మీరు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తారు. తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల బ్యాక్టీరియా మూత్ర మార్గం నుంచి బయటకు పోతుంది. సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఆపుతుంది. మహిళలు రోజూ కనీసం 2-3 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే నీటిని పుష్కలంగా తాగితే యుటిఐ సమస్యలు వచ్చే  ప్రమాదం తగ్గుతుంది. 
 

click me!