పొటాషియం రోజుకు ఎంత తీసుకోవాలి
మాయో క్లినిక్ ప్రకారం.. శరీరంలో పొటాషియం లోపించడం చాలా అరుదు. ఇక అసలు విషయానికొస్తే.. పెద్దలకు రోజుకు 1600 నుంచి 2000 మి.గ్రా పొటాషియం సరిపోతుంది.
పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు
పొటాషియం చాలా ఆహారాల్లో పుష్కలంగా ఉంటుంది. ఆకు కూరలు, పాలు, పాల ఉత్పత్తులు, బీన్స్, కాయలు, ట్యూనా, కాడ్, ట్రౌట్ వంటిచేపలు, చలికాలపు స్క్వాష్ వంటి పండి కూరగాయల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో లేదు.
అంతేకాదు నారింజ, అరటిపండ్లు, నేరేడు పండ్లు, కాంటాలౌప్, ద్రాక్షపండు వంటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
కిడ్నీ బీన్స్, కాయధాన్యాలు, సోయాబీన్స్, లిమా బీన్స్ తో సహా అన్ని రకాల బీన్స్, చిక్కుళ్లలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది.