అకస్మత్తుగా బరువు తగ్గారా? అయితే జాగ్రత్త.. ఈ రోగాలే కారణం కావొచ్చు

First Published Dec 12, 2022, 1:07 PM IST

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అకస్మత్తుగా బరువు తగ్గడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్, డయాబెటీస్ వంటి ఎన్నో రోగాలకు కారణం కావొచ్చంటున్నారు డాక్టర్లు. 

ఓవర్ వెయిట్ వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండెజబ్బులు, ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే అధిక బరువున్న వాళ్లు వెయిట్ ను తగ్గించుకోవడానికి రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంటారు. నిజానికి రోజూ వ్యాయామం చేసినా అంత సులువుగా బరువు తగ్గరు. కానీ కొంతమంది మాత్రం అకస్మత్తుగా బరువు తగ్గిపోతుంటారు. దీనికి కారణం ఎన్నో వ్యాధులేనంటున్నారు డాక్టర్లు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఒత్తిడి

అవును ఒత్తిడి కూడా అకస్మత్తుగా బరువు తగ్గడానికి కారణమవుతుంది. మీరు ఎలాంటి శారీరక శ్రమ చేయకున్నా.. అదనపు పౌండ్లను కోల్పోతుంటే.. మీరు ఖచ్చితంగా ఒత్తిడి వల్లేనని అర్థం చేసుకోవాలి. ఇది మంచి సంకేతం కాదంటున్నారు డాక్టర్లు. నిజానికి ఒత్తిడి వల్ల మానసిక సమస్యలే కాదు.. శారీరక సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయండి. 
 

డయాబెటిస్

డయాబెటిస్ తో బాధపడుతున్న చాలా ఊబకాయం కలిగి ఉంటారు. అయితే ఊబకాయలు ఆకస్మత్తుగా బరువు తగ్గడం డయాబెటీస్ సంకేతాలలో మొదటిదని నిపుణులు అంటున్నారు. అయినా ఈ రోజుల్లో డయాబెటీస్ సర్వ సాధారణ వ్యాధిగా మారిపోయింది. పిల్లలు, యువత కూడా దీనిబారిన పడుతున్నారు. 
 

ఊపిరితిత్తుల క్యాన్సర్
 
శాస్త్రీయ ఆధారాల ప్రకారం.. 10 కిలోగ్రాముల కంటే ఎక్కువ తగ్గడం ప్యాంక్రియాస్, కడుపు, అన్నవాహిక లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్స్ కు సంకేతమంటున్నారు డాక్టర్లు. ఎలాంటి శారీరక చేయకున్నా బరువు తగ్గుతుంటే.. ఖచ్చితంగా ఈ టెస్టులు చేయించుకోండి.

అజీర్థి

ఆకస్మత్తుగా బరువు తగ్గడానికి అత్యంత సాధారణ కారణాలలో అజీర్థి కూడా ఒకటి. ఈ సమయంలో శరీరం ఆహారాన్ని సరిగ్గా విచ్ఛిన్నం చేయలేకపోతుంది. దీంతో శరీర కణాలకు పోషకాలు సరిగ్గా అందవు.  బరువు తగ్గడం పక్కన పెడితే.. దీర్ఘకాలిక అలసట, వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు వస్తాయి. 
 

మూత్రపిండాల వ్యాధి

 మూత్రపిండాలు జీర్ణక్రియ, జీవక్రియలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఒకవేళ మూత్రపిండాలు విఫలమైతే  ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో మొదటి లక్షణాలలో బరువు తగ్గడం ఒకటి.         

click me!