Headache: నాలుక కింద చిటికెడు ఉప్పు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా?

Published : Feb 13, 2026, 12:33 PM IST

Headache: మైగ్రేన్ తలనొప్పిని భరించడం చాలా కష్టం. మీరు కూడా తలనొప్పిని భరిస్తూ ఉంటే ఇక్కడ మేము ఈ చిట్కా పాటించండి. ఉప్పు సాయం తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ ఉప్పు చిట్కా గురించి తెలుసుకోండి.

PREV
14
ఉప్పుతో తలనొప్పి తగ్గుతుందా?

ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా ఉప్పు ఉంటుంది.  ఉప్పు లేని కూర రుచి పచీ ఉండదు. ప్రతీ వంటగదిలో ఉప్పుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంంది. మన శరీరానికి సోడియం అవసరం. లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే అదే ఉప్పుతో తలనొప్పిని తగ్గిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మైగ్రేన్ వల్ల ఇబ్బంది పెడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువ. ఇది ఎంతో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఆ నొప్పి మొదలైతే తట్టుకోవడం కష్టం. ఎప్పుడొస్తుందో తెలియని ఈ మైగ్రేన్‌ను తగ్గించే శక్తి ఉప్పుకు ఉంది. చిటికెడు ఉప్పుతో మీరు మైగ్రేన్‌ను తగ్గించుకోవచ్చు.

24
ఉప్పును ఇలా వాడండి

మైగ్రేన్ నొప్పి మొదలవగానే నాలుక కింద చిటికెడు ఉప్పును తీసి పెట్టుకోండి. అది పూర్తిగా కరిగే వరకు ఉంచండి.  తరువాత గ్లాసు నీళ్లు తాగండి. ఇలా చేశాక అయదు నిమిషాల తరువాత మీ మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది. ఇది తలనొప్పి, తలభారం, కళ్లలో నీళ్లు కారడం వంటి సమస్యలకూ కూడా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకుంటారు. ఉప్పులోని సోడియం, రక్తంలోని ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేస్తుంది. మెదడులోని రక్తనాళాల వాపును తగ్గించి, నొప్పి తగ్గుతోందనే సంకేతాన్ని మెదడుకు పంపుతుంది.  ఏడు రోజుల పాటు రోజూ నాలుక కింద చిటికెడు ఉప్పు పెట్టుకుని నీళ్లు తాగాలి. నీటిని నెమ్మదిగా తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉప్పు, నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఉదయాన్నే తలభారంగా ఉండేవారు ఈ ఉప్పు చిట్కాను ప్రయత్నించవచ్చు. మైగ్రేన్, తలనొప్పి రావడానికి డీహైడ్రేషన్ ఒక ముఖ్య కారణం. కాబట్టి తరచుగా నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి.  ఇలా చేస్తే తలనొప్పి సమస్య రాకుండా చూసుకోవచ్చు.

34
వెల్లుల్లి వాడకం

తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారికి వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది.  వెల్లుల్లిలో ఉండే 'అల్లిసిన్' అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తలనొప్పిని, వాపును తగ్గిస్తుంది. వెల్లుల్లిని నీటిలో మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వారం రోజుల పాటూ తాగి చూడండి మీకు మంచి ఫలితాలు కలిగిస్తాయి.

44
లవంగ నూనె

తలనొప్పిని తగ్గించడంలో లవంగ నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ కొబ్బరి నూనె, ఒక టీస్పూన్ ఉప్పులో కొన్ని చుక్కల లవంగ నూనె కలపండి. దీన్ని పేస్టులా చేసుకుని దాన్ని నుదుటిపై రాయండి. ఇప్పుడు తలకు శుభ్రమైన రుమాలు కట్టుకోవాలి. యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న లవంగం తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తలనొప్పి తగ్గాలంటే, అల్లం ముక్కలను నీటిలో మరిగించి, ఆ నీటిని టీలా తాగండి. అల్లం టీ తాగడం వల్ల తలనొప్పి చాలవరకు తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories