Water Tank Placement: ఇండియాలో ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకును డాబాపైనే పెడతారు. కానీ కింద ఎందుకు పెట్టకూడదు? ఒక వేళ నేల మీద కడితే ఇబ్బందేమైనా ఉందా? అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియాలో ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకును డాబాపైనే పెడతారు. కానీ చాలామంది స్థలం లేకనో, క్లీన్ చేయడం ఈజీ అనో వాటర్ ట్యాంక్‌ను కింద కడుతుంటారు. చూడటానికి ఇది బాగానే ఉన్నా, రోజూ కరెంటు, నీళ్ల కష్టాలు తప్పవు. ట్యాంక్ కింద ఉంటే నీళ్లు వాటంతట అవే పైకి వెళ్లవు.
ఒక్క చుక్క నీరు కూడా రాదు
ట్యాంక్ కింద ఉంటే వంటగది, బాత్రూమ్ లేదా పైకి నీళ్లు వెళ్లాలంటే ప్రతిసారీ మోటార్ వేయాల్సిందే. దీనివల్ల కరెంటు బిల్లు భారీగా వస్తుంది. మోటార్ తరచూ పాడైపోయి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కరెంటు పోతే కుళాయిలో చుక్క నీరు కూడా రాదు. అత్యవసర సమయాల్లో కరెంటు లేకపోతే ఇంట్లో ఏ పనీ జరగదు. కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
24
డాబా మీద ట్యాంక్ పెట్టడమే బెస్ట్
గ్రావిటీ వల్ల నీళ్లు ఎప్పుడూ పైనుంచి కిందకే వేగంగా వస్తాయి. ట్యాంక్ ఎంత ఎత్తులో ఉంటే, కుళాయిలో నీటి ప్రెజర్ అంత ఎక్కువగా ఉంటుంది. డాబా మీద ట్యాంక్ పెడితే మోటార్, కరెంటుతో పనిలేకుండా కుళాయి తిప్పగానే నీళ్లు వస్తాయి. దీనివల్ల కరెంటు ఆదా అవుతుంది. అందుకే ఇల్లు కట్టేటప్పుడు ట్యాంక్‌ను కింద కాకుండా డాబా మీదే పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
34
కీటకాల నుంచి రక్షణ
నేల మీద లేదా అండర్ గ్రౌండ్‌లో ట్యాంక్ కడితే, వర్షపు నీరు, కీటకాలు లోపలికి చేరే ప్రమాదం ఉంది. సరిగ్గా మూతపెట్టకపోతే దోమలు చేరి డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయి. అలాగే వర్షపు నీరు లీకై ట్యాంక్‌లో కలిస్తే, తాగే నీరు కలుషితమై ఇంట్లో వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
అదే డాబా మీద ట్యాంక్ ఉంటే క్లీన్ చేయడం చాలా ఈజీ. సూర్యరశ్మి వల్ల నాచు పట్టకుండా చూసుకోవచ్చు. కరెంటు ఆదా చేయడమే కాకుండా, మన కుటుంబ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ ట్యాంక్‌ను డాబా మీదే ఏర్పాటు చేసుకోవడం ఎప్పుడైనా మంచిది.
ఇంటి లైఫ్, భద్రత పరంగా చూసినా కింద ట్యాంక్ కట్టడం ప్రమాదకరం. నేల మీద పెద్ద వాటర్ ట్యాంక్ కట్టినప్పుడు, రాబోయే రోజుల్లో చిన్న లీకేజీ వచ్చినా గోడలకు చెమ్మ పడుతుంది. ఈ చెమ్మ నెమ్మదిగా పాకి ఇంటి పునాదులను, పిల్లర్లను బలహీనపరుస్తుంది.
దీనివల్ల భవనం లైఫ్ తగ్గిపోవడమే కాకుండా, భవిష్యత్తులో రిపేర్లకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే డాబా మీద ట్యాంక్ పెడితే ఇంటి పునాదికి ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి ఇంటి భద్రతను దృష్టిలో ఉంచుకుని డాబా మీదే వాటర్ ట్యాంక్ కట్టడం సరైన నిర్ణయం.