Parenting: ప్రతి తండ్రి తన కొడుకు జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని, ఆర్థికంగా స్థిరపడాలని, సమాజంలో గౌరవంగా జీవించాలని కోరుకుంటాడు. అయితే అందుకోసం చిన్నప్పటి నుంచే తండ్రి కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రతి తండ్రికి తన కొడుకు భవిష్యత్ కోసం ఎంతో కష్టపడతాడు. మంచి చదువు చెప్పించడంతో పాటు తనకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఆరాటపడతాడు. అయితే వాటితో పాటు మరో 5 ముఖ్యమైన పనులు తప్పక చేయాలి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొడుకు విషయంలో తండ్రి చేసే చిన్న చిన్న పనులు పిల్లల ఆలోచనా విధానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తులో ఇతరులతో మెలిగే తీరును ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. మరి కొడుకు భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి తండ్రి తప్పనిసరిగా చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఏంటో చూద్దాం.
26
మంచి మాటలతో పాటు మంచి ప్రవర్తనను నేర్పించడం
తండ్రి ఇతరులతో గౌరవంగా మాట్లాడటం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, తప్పు చేసినప్పుడు అంగీకరించడం వంటి పనులను కొడుకు గమనిస్తాడు. వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. కొడుకు మంచి వ్యక్తిగా ఎదగాలని కోరుకునే తండ్రి ముందుగా తన ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. అలాగే అబ్బాయిలు ఏడవకూడదు, బాధను బయటపెట్టకూడదు అనే భావనను పిల్లల్లో నాటకూడదు. భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు సహాయం అడగడం కూడా జీవితంలో ముఖ్యమైన లక్షణాలేనని వివరించాలి.
36
జీవితానికి అవసరమైన స్కిల్స్ నేర్పించడం
కొడుకు భవిష్యత్ బాగుండాలంటే మంచి మార్కులు సాధించడం ఒక్కటే లక్ష్యంగా పెట్టకూడదు. చదువుతో పాటు సమస్యలను పరిష్కరించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులతో కలిసి పనిచేయడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటి నైపుణ్యాలు కూడా నేర్పించాలి. అలాగే పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం వంటి వాటిని ప్రోత్సహించాలి.
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని బాధ్యతగా ఖర్చు చేయడం, కొంత పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యమని తండ్రి కొడుకుకు నేర్పించాలి. చిన్న వయసు నుంచే అవసరాలు, కోరికల మధ్య తేడాను వివరించాలి. ఏదైనా వస్తువు కొనాలని అడిగినప్పుడు వెంటనే కొనివ్వడం కంటే, ఆ వస్తువు నిజంగా అవసరమా, దాని ధర ఎంత, డబ్బును ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై చర్చించవచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను పిల్లల వయసుకు తగిన రీతిలో వివరించడం కూడా మంచిదే.
56
కొడుకుతో స్నేహంగా ఉండటం
పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారికి ఎన్నో సందేహాలు, భయాలు, సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో తండ్రితో స్వేచ్ఛగా మాట్లాడగలగడం చాలా ముఖ్యం. కొడుకు ఏదైనా సమస్య చెప్పినప్పుడు వెంటనే కోప్పడటం, విమర్శించడం చేస్తే, భవిష్యత్తులో తన సమస్యలను చెప్పడానికి వెనుకాడవచ్చు. అందుకే తండ్రి ప్రతిరోజూ కొంత సమయాన్ని కొడుకుతో మాట్లాడటానికి కేటాయించాలి. ప్రేమతో కూడిన క్రమశిక్షణ పిల్లల్లో భద్రతాభావాన్ని, బాధ్యతను పెంపొందించడానికి సహాయపడుతుంది.
66
ఓటమిని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచడం
ప్రతి తండ్రి తన కొడుకు జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు. కానీ జీవితంలో ఎప్పుడూ విజయం మాత్రమే ఉండదని, కొన్నిసార్లు అపజయాలు కూడా ఎదురవుతాయని పిల్లలకు ముందుగానే అర్థమయ్యేలా చెప్పాలి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు, ఆటల్లో ఓడిపోయినప్పుడు లేదా ప్రయత్నించిన పని సరిగా జరగనప్పుడు పిల్లలను అవమానించకుండా, తప్పుల నుంచి నేర్చుకునేలా ప్రోత్సహించాలి. పిల్లలకు అవసరమైనప్పుడు అండగా నిలుస్తూనే, తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించడం తండ్రి చేయగలిగే గొప్ప సహాయం.