Railway: మీరు ఎప్పుడైనా గమనించారా? రైల్వే ప్లాట్ ఫారమ్ పై చాలా రకాల దుకాణాలు ఉంటాయి. కానీ, మెడికల్ షాప్ మాత్రం ఉండదు. దీని వెనక కారణం ఏంటో తెలుసా? అసలు ఎలాంటి మందులు దొరకవా? ఎమర్జీ టైమ్ లో ఏం చేయాలి?
మనం రైలు ప్రయాణం చేసే సమయంలో దాదాపు అన్ని రకాల సర్వీసులను అందిస్తుంది. రైలు ఎక్కడానికి ఫ్లాట్ ఫారమ్ పై వెయిట్ చేస్తున్న సమయంలో కూడా మనకు చాలా రకాల ఫుడ్స్ ఐటమ్స్ లభిస్తుంది. మంచినీళ్ల దగ్గర నుంచి కూల్ డ్రింక్స్, చిప్స్ లాంటి ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. కానీ... మెడికల్ షాపులు మాత్రం ఒక్కటి కూడా కనిపించదు.. అసలు..ఫ్లాట్ ఫారమ్ మీద మందుల దుకాణం ఎందుకు పెట్టరు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
23
ఇది రైల్వే నియమమా?
ఇప్పుడంటే.. రైల్వే ప్లాట్ ఫారమ్ లపై మెడికల్ దుకాణాలు ఉండటం లేదు. కానీ, ఒకప్పుడు ఉండేవి. ముఖ్యంగా 2001 వరకు ఈ సదుపాయం ఉండేది. జస్ట్ మెడికల్ సాప్ ఉండటమే కాదు.. డాక్టర్ కూడా అందుబాటులో ఉండాలి అనే నియమం ఉండేది. ప్రతి రైల్వే ప్లాట్ ఫారమ్ పై 108 చదరపు అడుగుల స్థలం సరిపోయేలా మాత్రమే మెడికల్ షాప్ ఉండాలని రూల్ పెట్టారు. అయితే.. ఆ తర్వాత.. ఈ రూల్ ని మార్చేశారు. రైల్వే ప్లాట్ ఫారమ్ పై మందుల దుకాణం పెట్టకూడదు అనే నిబంధనను తీసుకువచ్చారు. అంటే.. స్పెషల్ గా మెడికల్ షాప్ ఉండటం కాకుండా.. పుస్తకాలు, సరుకులు లాంటి వాటితో కలిపి మెడిసిన్స్ అమ్ముకునేలా రూల్ తీసుకువచ్చారు. అది కూడా.. అన్ని రకాల మందులు దొరికే అవకాశాలు ఉండవు.
డాక్టర్ ప్రిస్కిప్షన్ అవసరం లేని మందులు ఉంటాయి కదా.. జ్వరం, జలుబు, దగ్గు, పెయిన్ కిల్లర్స్ ఇలాంటి వాటిని మాత్రమే అమ్ముతారు. ఇక ముందు...కూడా స్పెషల్ గా రైల్వే ప్లాట్ ఫారమ్ లపై ఫార్మసీలను పెట్టే అవకాశం తక్కువ. మన దేశం మొత్తంలో కేవలం 21 స్టేషన్ లలో మాత్రమే స్పెషల్ గా మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. అయితే.. ఈ ఫార్మసీలు లేకపోయినా.. ప్రయాణికులకు వైద్య సదుపాయాల్లో లోపం రాకుండా ఉండేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు.
33
అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి..?
మనకు ఎప్పుడు ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందో ఎవరూ ఊహించలేరు. పొరపాటున రైల్వే స్టేషన్ లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే...రైల్వే అధికారులకు సమాచారం అందించాలి. రైల్వే గార్డ్స్, స్టేషన్ మాస్టర్స్ లకు ముందుగానే ప్రథమ చికిత్సకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి.. వారు వారు ప్రథమ చికిత్స చేస్తారు. అంతేకాకుండా.. ప్రతి రైల్వే స్టేషన్ లో డాక్టర్స్ జాబితా, ఫోన్ నెంబర్స్ ఉంటాయి. సమీపంలోనే హాస్పిటల్ కూడా ఉంటుంది. కాబట్టి.. వాటి సహాయంతో.. ప్రమాదం నుంచి బయటపడొచ్చు.