Grey Hair Remedy: వయసుతో సంబంధం లేదు...ఇప్పుడు అందరికీ తెల్లు జుట్టు వచ్చేస్తుంది. అలా అని దీని కోసం ఎక్కువ ఆలోచించి జుట్టు పీక్కోకండి. ఇదొక్కటి మీ రాసుకునే నూనెలో కలుపుకుని తలకు పట్టిస్తే...ఫలితం మీరే చూస్తారు.
ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే అందరికీ తెల్లజుట్టు వచ్చేస్తుంది. చిన్న పిల్లలకు వైట్ హెయిర్ రావడం మామూలైపోయింది. అలా అని మొత్తం ఉండదు. సగం నలుపు, సగం తెల్లగా ఉంటుంది. దాన్ని ఉంచలేం, తీసేయలేం. కానీ ముందు వైపు కనిపించగానే కంగారు పడిపోతారు. దీంతో హెయిర్ డై, రకరకాల షాంపూలు, ట్రీట్‌మెంట్ల వైపు పరగులు పెడతారు. ఇలా కాకుండా కాస్త శ్రద్ధ పెడితే ఎప్పటికీ తెల్ల జుట్టు రాకుండా చేయొచ్చు.
25
కలోంజి గింజల మ్యాజిక్
తలకు షాంపూ చేసే ముందు, అందులో కొన్ని చుక్కల కలొంజి నూనె కలపండి. శతాబ్దాలుగా ఈ నూనెను జుట్టు పోషణలో వాడుతున్నారు. ఇది మాడుకు, వెంట్రుకల కుదుళ్లకు పోషణ అందిస్తుంది.
35
జుట్టు బలంగా ఉంటుంది
జుట్టులో సహజ రంగును ఉత్పత్తి చేసే మెలనిన్ పిగ్మెంట్ తగ్గడం వల్ల తెల్ల జుట్టు సమస్య పెరుగుతుంది. ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్, పోషకాహార లోపం, మాడు ఆరోగ్యం సరిగా లేకపోవడం కూడా దీనికి కారణాలు కావచ్చు. కలొంజి నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు మాడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనివల్ల కొత్తగా పెరిగే జుట్టు బలంగా ఉంటుంది.
మీ చేతిలోకి సరిపడా షాంపూ తీసుకోండి. అందులో 2 నుంచి 4 చుక్కల కలొంజి నూనె కలపండి. రెండింటినీ బాగా మిక్స్ చేసి, మాడుకు, జుట్టు కుదుళ్లకు పట్టించండి. 1 నుంచి 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మామూలుగా తలస్నానం చేయండి. గుర్తుంచుకోండి, నూనెను నేరుగా షాంపూ బాటిల్‌లో కలపవద్దు, అలా చేస్తే షాంపూ పాడయ్యే అవకాశం ఉంది.
55
4 నుంచి 6 వారాల సమయం పడుతుంది
మంచి ఫలితాల కోసం వారానికి 2 నుంచి 3 సార్లు ఈ చిట్కాను ప్రయత్నించవచ్చు. జుట్టు నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి, మార్పు కనిపించడానికి కనీసం 4 నుంచి 6 వారాల సమయం పట్టవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే, కలొంజి నూనె తెల్ల జుట్టును రాత్రికి రాత్రే నల్లగా మార్చదు. కానీ రోజూ వాడటం వల్ల జుట్టు బలంగా, మృదువుగా, పొడిబారకుండా ఉంటుంది. ఇది తెల్ల జుట్టు మెరుపును తగ్గించి, మిగతా జుట్టులో సులభంగా కలిసిపోయేలా చేస్తుంది.