Rice: అన్నం వండే ముందు బియ్యాన్ని ఒకటి, రెండుసార్లు ఎందుకు కడగాలి? కడగకపోతే ఏమవుతుంది?

Published : Nov 19, 2026, 04:11 PM IST

Rice: మనం రోజూ ఇంట్లో అన్నం వండుకుంటూనే ఉంటాం. అయితే అన్నం వండే ముందు బియ్యాన్ని ఒకటి, రెండుసార్లు నీటితో కడిగి కుక్కర్‌లో వేయడం చాలామందికి అలవాటు. అసలు బియ్యాన్ని ఎందుకు కడగాలి? ఎన్నిసార్లు కడగాలి? కడగకుండా నేరుగా వండితే ఏమవుతుందో తెలుసుకుందాం.

PREV
15
బియ్యాన్ని ఎందుకు కడగాలి?

మన ఇంట్లో ప్రతిరోజూ అన్నం వండుకోవడం సహజం. అయితే అన్నం వండే ముందు బియ్యాన్ని నీటితో కడిగిన తర్వాతే వండుతుంటాం. అసలు బియ్యాన్ని ఎందుకు కడగాలి? బియ్యంపై ఉండే దుమ్ము, ధూళి తొలగించడానికేనా? లేక బియ్యం కడగడం వల్ల అన్నం రుచిలో, నాణ్యతలో మార్పులు వస్తాయా? బియ్యం కడగకుండా నేరుగా వండితే ఆరోగ్యానికి మంచిది కాదా? బియ్యాన్ని ఎక్కువసార్లు కడిగితే అందులోని పోషకాలు పోతాయా? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. వాటిని ఇక్కడ క్లియర్ చేసుకుందాం.

బియ్యం అనేక దశలను దాటి మన ఇళ్లకు చేరుతుంది. వరి కోత, ఎండబెట్టడం, మిల్లింగ్, ప్యాకింగ్, రవాణా వంటి ప్రక్రియల్లో బియ్యంపై చిన్న చిన్న ధూళి కణాలు, పొట్టు అవశేషాలు, ఇతర మలినాలు చేరే అవకాశం ఉంటుంది. అందుకే వండే ముందు బియ్యాన్ని నీటితో కడగడం మంచిది. ఇలా చేయడం వల్ల బియ్యంపై ఉండే దుమ్ము, ధూళి, చిన్న చిన్న మలినాలు తొలగిపోతాయి. అయితే కడగడం వల్ల అన్ని రకాల రసాయనాలు లేదా సూక్ష్మజీవులు పూర్తిగా తొలగిపోతాయని చెప్పలేము.

25
బియ్యాన్ని రెండుసార్లు కడగాలా?

బియ్యాన్ని ఒకటి లేదా రెండుసార్లు శుభ్రమైన నీటితో మెల్లగా కడిగితే దానిపై ఉండే వదులైన మలినాలు తొలగిపోతాయి. మొదటిసారి కడిగినప్పుడు నీరు కొద్దిగా తెల్లగా లేదా మసకగా కనిపించవచ్చు. దీనికి ప్రధాన కారణం బియ్యం గింజలపై ఉండే ఉపరితల పిండి పదార్థం. రెండోసారి కడిగినప్పుడు నీరు కొంతవరకు స్పష్టంగా మారుతుంది. అయితే నీరు పూర్తిగా పారదర్శకంగా వచ్చే వరకు పదేపదే కడగాల్సిన పని లేదు.

35
బియ్యం కడగడం వల్ల అన్నం రుచి మారుతుందా?

బియ్యాన్ని మంచిగా కడిగితే వాటి ఉపరితలంపై ఉండే అదనపు పిండి పదార్థం తొలగిపోతుంది. దీనివల్ల అన్నం కాస్త పొడిపొడిగా తయారవుతుంది. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి వంటకాలకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అయితే నార్మల్ రైస్ చేసేటప్పుడు బియ్యం రకం, నీటి పరిమాణం, వండే విధానం కూడా అన్నం మెత్తదనాన్ని, రుచిని ప్రభావితం చేస్తాయి.

45
బియ్యాన్ని కడగకుండా వండితే ఏమవుతుంది?

బియ్యాన్ని కడగకుండా నేరుగా వండితే దానిపై ఉండే దుమ్ము, ధూళి, పొట్టు అవశేషాలు, ఇతర మలినాలు అన్నంలోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బహిరంగంగా నిల్వ చేసిన బియ్యంలో ఇలాంటి మలినాలు ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల బియ్యాన్ని కడగకుండా వండటం మంచిదికాదు. అయితే కొన్నిరైస్ ప్యాకెట్లపై వండే ముందు కడగాల్సిన అవసరం లేదనే సూచన ఉంటుంది. అలాంటి బియ్యాన్ని ప్రత్యేకంగా కడగాల్సిన పనిలేదు.

55
బియ్యాన్ని ఎక్కువసార్లు కడిగితే పోషకాలు పోతాయా?

బియ్యాన్ని కడగడం వల్ల ఉపయోగాలున్నప్పటికీ, అతిగా కడగడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. బియ్యంలో సహజంగా ఉండే కొన్ని నీటిలో కరిగే విటమిన్లు, ఖనిజాలు కడిగే నీటితో పాటు కొంతవరకు బయటకు వెళ్లిపోవచ్చు. కాబట్టి బియ్యాన్ని పదేపదే కడగడం, ఎక్కువసేపు నానబెట్టడం అవసరం లేదు. ఒకటి లేదా రెండుసార్లు మెల్లగా కడిగితే సరిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories