Saree Maintaining Tips: ఈ టిప్స్ తో మీకు నచ్చిన చీరలను ఎన్నేళ్లయినా కొత్తవాటిలా ఉంచుకోవచ్చు!

Published : Nov 19, 2026, 01:56 PM IST

Saree Maintaining Tips: కొన్ని చీరలు మనసుకు బాగా నచ్చుతాయి. అవి ఎప్పుడూ కొత్తగా ఉంటే బాగుండని చాలామంది మహిళలకు అనిపిస్తుంటుంది. మరి ఎన్ని సంవత్సరాలు గడిచినా చీరలు ఎప్పుడూ కొత్తవాటిలా మెరవాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాల్సిందే. అవేంటో చూద్దాం.

PREV
15
చీరలు ఎప్పుడూ కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి?

ఎన్నేళ్లయినా చీరలు కొత్తవాటిలా మెరవాలంటే ముందుగా వాటిని ఉతికే విధానంపై శ్రద్ధ పెట్టాలి. సాధారణ నీటిలో ఉండే మినరల్స్ పట్టు దారాన్ని బలహీనపరిచి, జరీ నల్లబడేలా చేస్తాయి. కాబట్టి, పట్టు చీరలను నీటిలో తడపకుండా డ్రై క్లీన్ మాత్రమే చేయాలి. మరకలు పడితే ఆ ప్రదేశాన్ని మాత్రమే తడి స్పాంజితో తుడిచి నీడలో ఆరబెట్టాలి.

మొదటిసారి ఉతికేటప్పుడు రంగు పోకుండా ఉండటానికి, ఒక బకెట్ నీటిలో 2-3 స్పూన్ల కల్లుప్పు కలిపి చీరను 15 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి. అలాగే, చిక్కటి గంజికి బదులుగా పల్చటి గంజిలో అర స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆముదం కలిపి ముంచి తీస్తే చీర గట్టిపడి చిరగకుండా ఉంటుంది. జార్జెట్, షిఫాన్ లాంటి మృదువైన చీరలను వాషింగ్ పౌడర్ లేదా వాషింగ్ మెషీన్లో వేయకుండా, చల్లటి నీటిలో కొద్దిగా హెయిర్ షాంపూ కలిపి 5 నిమిషాలు నానబెట్టి మృదువుగా ఉతకాలి.

25
బీరువాలో భద్రపరిచే విధానం

పట్టు చీరలను షాపుల్లో ఇచ్చే ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు. అది గాలి వెళ్లకుండా చేసి తేమను సృష్టించి ఫంగస్, జరీ నల్లబడటానికి దారితీస్తుంది. దానికి బదులుగా శుభ్రమైన తెలుపు కాటన్ వస్త్రం లేదా కాటన్ చీరల్లో చుట్టి ఉంచాలి.

35
మడత మార్చడం

ఒకే మడతలో నెలల తరబడి ఉంచితే ఆ మడత దగ్గర దారం బలహీనపడి చీర చిరిగిపోతుంది. కాబట్టి, 3 నెలలకోసారి చీరను బయటకు తీసి నీడలో గాలికి ఆరబెట్టి, వేరే కోణంలో మడిచి ఉంచాలి. బరువైన పట్టు చీరలను ఇనుప హ్యాంగర్లకు వేలాడదీయకూడదు. అవసరమైతే చెక్కతో చేసిన లేదా వస్త్రం చుట్టిన హ్యాంగర్లను ఉపయోగించడం మంచిది.

45
పురుగులను నిరోధించడం

బీరువాలోకి పురుగులు రాకుండా చాలామంది రసాయనాలు కలిపిన చిన్న చిన్న బాల్స్ ని వాడుతుంటారు. వాటి నుంచి వచ్చే గాలి చీర జరీని పాడుచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి బదులు ఎండిన వేప ఆకులు, లవంగాలు, బిర్యానీ ఆకులను ఒక తెల్లని వస్త్రంలో మూటగా కట్టి బీరువా మూలల్లో ఉంచితే సరిపోతుంది.

55
పర్ఫ్యూమ్, ఐరన్ వల్ల..

పర్ఫ్యూమ్‌లలో ఉండే ఆల్కహాల్ చీరపై శాశ్వత మరకలను, జరీలో నలుపును కలిగిస్తుంది. కాబట్టి, పర్ఫ్యూమ్‌ను చీర పైన కాకుండా శరీరంపై మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఐరన్ బాక్స్‌ను నేరుగా చీరపై ఉంచకుండా, పైన ఒక పల్చటి తడి కాటన్ వస్త్రాన్ని పరిచి మీడియం వేడితో ఇస్త్రీ చేయాలి. జరీ వర్క్ ఉన్న చీరలను ఎప్పుడూ లోపలి వైపునకు తిప్పి ఐరన్ చేయడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories