ట్యాబ్లెట్ మీద గీత లేకపోతే...
ట్యాబ్లెట్ మీద గీత లేదు అంటే ఆ ట్యాబ్లెట్ ను తుంచకూడదు. అలాంటి ట్యాబ్లెట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి..
ఎంటరిక్ కోటెడ్ (Enteric Coated): కొన్ని మాత్రలకు పైన ఒక ప్రత్యేకమైన పొర ఉంటుంది. ఇవి కడుపులో కరగకుండా నేరుగా పేగుల్లోకి వెళ్లి కరగాలి. వీటిని విరిస్తే ఆ పొర దెబ్బతిని, మందు సరిగ్గా పనిచేయదు సరే కదా.. కడుపులో మంట లేదా అల్సర్‌కు దారితీయవచ్చు.
టైమ్ రిలీజ్డ్ టాబ్లెట్స్ (Sustained Release): కొన్ని మందులు రోజంతా నెమ్మదిగా రక్తంలో కలవాలి. వాటిని తుంచి వేసుకుంటే, మందు అంతా ఒక్కసారిగా శరీరంలోకి చేరి ప్రమాదకరంగా మారుతుంది.
3.క్యాప్సూల్స్ ఎలా వేసుకోవాలి?
క్యాప్సూల్స్‌ను ఎప్పుడూ తెరిచి లోపల ఉన్న పొడిని నీళ్లలో కలుపుకుని తాగకూడదు. ఆ ప్లాస్టిక్ లాంటి కవర్ (Gelatin) కడుపులోకి వెళ్ళాక ఒక నిర్ణీత సమయంలోనే కరగాలి. దాన్ని తీసేస్తే మందు ప్రభావం ఉండదు.
ఈ విషయాలు మీకు తెలుసా?
ఎర్రటి గీత (Red Line): కొన్ని మందుల స్ట్రిప్స్ వెనుక నిలువుగా ఎర్రటి గీత ఉంటుంది. దీని అర్థం "డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందును అమ్మకూడదు/వాడకూడదు". ముఖ్యంగా యాంటీబయోటిక్స్ విషయంలో ఇది కనిపిస్తుంది.
ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి: మాత్రను విరిచే ముందు లేదా వాడే ముందు ఆ ప్యాకెట్ మీద తేదీని తప్పక గమనించండి.