మన వాతావరణానికి పర్ఫెక్ట్ మ్యాచ్...
భారతదేశంలో వాతావరణం వేడి ఎక్కువగా ఉంటుంది. విస్కీని వాటర్, సోడా లేదా వాటర్ క్యూబ్స్ తో కలిపి తీసుకుంటారు. దీంతో.. మన వాతావరణానికి ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అందుకే.. ఇండియన్స్ దీనికి ఎక్కువగా కనెక్ట్ అవుతారు.
స్పైసీ ఫుడ్‌తో కిక్కెక్కించే కాంబినేషన్: మన భారతీయ వంటకాల్లో ఘాటైన మసాలాలు ఎక్కువ. కారంగా ఉండే నాన్-వెజ్, స్పైసీ ఫుడ్ తింటూ విస్కీతో కలిపి సోడా సిప్ చేస్తే ఆ కిక్కే వేరు. ఇది నాలుకపై ఉన్న మసాలా ఘాటును రీఫ్రెష్ చేస్తూ ఆహారాన్ని మరింత ఆస్వాదించేలా చేస్తుంది.
సినిమాలు సృష్టించిన ‘రాయల్’ ఇమేజ్: భారతీయ సినిమాలో విస్కీని ఎప్పుడూ ఒక పవర్, రాయల్టీ, హోదాకు సంకేతంగా చూపించారు. పెద్ద పెద్ద గాజు గ్లాసులు, రాయల్ బార్లు, శక్తివంతమైన క్యారెక్టర్లు విస్కీ గ్లాస్ పట్టుకుని కనిపించడంతో.. సాధారణ ప్రజల్లో కూడా దీనిపై ఒక లైఫ్‌స్టైల్ క్రేజ్ ఏర్పడింది.
గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న 'మేడ్ ఇన్ ఇండియా' విస్కీ.. ఒకప్పుడు బ్రిటీష్ వారి నుంచి వచ్చిన ఈ విస్కీ సంస్కృతిని భారతీయులు ఎంతగా సొంతం చేసుకున్నారంటే.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా విస్కీ అమ్ముడవుతున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు, మన దేశంలో తయారయ్యే అమృత్ (Amrut), ఇంద్రి (Indri) వంటి హోమ్‌గ్రోన్ విస్కీ బ్రాండ్లు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారాలు సాధించి, గ్లోబల్ విస్కీ ప్రియులను సైతం మైమరిపిస్తున్నాయి.