Village: ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా.. ఈ గ్రామంలోకి అడుగుపెట్టడానికి ‘ వరదలు’ భయపడతాయి..!

Published : Oct 31, 2026, 06:38 PM IST

Village: తుఫాన్ వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా... చాలా గ్రామాలు నీట మునిగిపోతాయి. కానీ, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా... ఈ గ్రామంలోకి అడుగుపెట్టవు. వరదలే భయపడి పారిపోతాయి. ఇంతకీ ఆ గ్రామం ఏంటి?

PREV
13
సముద్రం పక్కనే ఉన్నా.. వరద ఎందుకు రాదు?

సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో, తుఫాన్ సమయంలో సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగిపోతూ ఉంటాయి. కానీ ఓ గ్రామంలోకి మాత్రం... ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా వరదలు అడుగు కూడా పెట్టలేవు. అదే.. ఫిలిప్పీన్స్ లోని నార్త్ మనీలా బే సమీపంలో ఉన్న పమరవాన్ అనే మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలోకి వరదలు ఎందుకు అడుగుపెట్టలేవు? రెండేళ్లవరకు చిన్న వరదలకే ఇబ్బంది పడ్డ ఆ గ్రామం సడెన్ గా ఎలా మారిపోయింది?

23
వరదలను తమిరి కొట్టిన గ్రామస్తులు...

ఒకప్పుడు చిన్నపాటి వరదలకే... ఈ గ్రామం అతలాకుతలం అయిపోయేది. దీని వల్ల గ్రామస్థులు చాలా ఇబ్బందులు పడేవారు. సముద్రం నుంచి వచ్చే భారీ అలల ఉధృతిని తగ్గించడానికి ఇక్కడ డచ్ ఇంజనీరింగ్ సంస్థ ‘హస్కోనింగ్’ ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టును పూర్తి చేసింది. అందుకోసం ఎలాంటి కాంక్రీట్ గోడలు లేదా సిమెంట్ వాడలేదు. కేవలం వెదురు బొంగులతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సముద్రంలో దాదాపు 14 హెక్టార్ల పరిధిలో ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తూ వెదురు బొంగులతో చట్రాలను అమర్చారు. ఇవి రాకాసి అలల వేగాన్ని పూర్తిగా తగ్గించేస్తాయి. అంతేకాకుండా, కొబ్బరి పీచుతో చేసిన నెట్లలో గుల్లలు నింపి సముద్రంలో ఉంచారు. ఇవి సహజమైన అలైన్మెంట్ లాగా పని చేసి అలల ఒత్తిడిని ఆపేస్తాయి.

33
గ్రామం భవిష్యత్తు మార్చేసిన ఐడియా...

ఈ వెదురు బొంగులతో చేసిన ఐడియా ఈ గ్రామ భవిష్యత్తునే మార్చేసింది. పొరుగు ఊళ్లు మొత్తం మునిగినా కూడా ఈ ఊరిలోకి మాత్రం చిన్న బొట్టు నీరు కూడా రాలేదు. ఇటీవల ఆగస్టు 2026లో అక్కడ కుండపోత వర్షాలు కురిసి, తీవ్రమైన వరదలు వచ్చాయి. ఆ వరదలకు పక్కనే ఉన్న ఎత్తైన ప్రాంతాల్లోని గ్రామాలు కూడా నీట మునిగిపోయాయి. ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. కానీ, ఈ గ్రామ ప్రజలు మాత్రం సురక్షితంగా ఉన్నారు. తీర ప్రాంతంలో ఉన్నా కూడా ఈ పమరవాన్ గ్రామానికి మాత్రం పైసా నష్టం జరగలేదు. సముద్రం నీరు ఈ ఊరిలోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం ఈ గ్రామం... చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories