నవంబర్‌లో వెళ్లాల్సిన మరో అందమైన ప్లేస్ చిక్కమగళూరు. ముళ్లయనగిరి, బాబాబుడన్‌గిరి, కాఫీ తోటలు ఇక్కడ స్పెషల్. మీరు ట్రెక్కింగ్ ఇష్టపడేవారైతే కచ్చితంగా ఇక్కడికి వెళ్లాల్సిందే. నవంబర్‌లో వానలు తగ్గి, వాతావరణం చల్లగా ఉంటుంది.
కర్ణాటకలోనే ఎత్తైన శిఖరం ముళ్లయనగిరి ఇక్కడే ఉంది. ఝరి ఫాల్స్, కాఫీ తోటల అందాలను ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ ఇష్టపడేవాళ్లకు ఇది సూపర్ స్పాట్.
హంపి
చలికాలంలో హంపి ట్రిప్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డిసెంబర్, జనవరిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నవంబర్‌లో వెళ్లడం బెస్ట్. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఇక్కడ కళ్లారా చూడొచ్చు. రాతి రథం, విరూపాక్ష, విజయ విఠల ఆలయాలు, తుంగభద్ర నది అందాలు ఆకట్టుకుంటాయి.
నవంబర్‌లో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి పగటిపూట హంపి అంతా నడుచుకుంటూ తిరగొచ్చు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్లేస్ హిస్టరీ లవర్స్‌కు బాగా నచ్చుతుంది. పక్కనే ఉన్న అంజనాద్రి కొండ పైనుంచి హంపిని చూస్తే ఆ వ్యూ అద్భుతంగా ఉంటుంది.