Blood River: నీళ్లు కాదు.. రక్తం ఏరులైపారే నది మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?

Published : Aug 08, 2026, 04:22 PM IST

Blood River: ఈ నదిలో ప్రవహించేది నీరు కాదు.. అచ్చంగా ఎర్రటి రక్తం. వినడానికి ఒళ్లు గగుర్పొడిచే ఈ వింత వెనక ఉన్న నిజాలు, పురాణ కథలు వింటే మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.

PREV
13
River Of Blood

మన దేశంలో మీరు ఇప్పటి వరకు ఎన్నో నదులను చూసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా ఎర్రటి రక్తపు రంగులో భయంగా, ఆశ్చర్యకరంగా పారే నదిని ఎప్పుడైనా చూశారా? దట్టమైన అడవులు, పొగమంచుతో నిండిన పర్వాతాల మధ్య, రుతువును బట్టి ఎరుపు, ఆరెంజ్ రంగుల్లో అచ్చం రక్తం పారుతున్నట్లుగా నీరు ప్రవహించే నది ఒకటి ఉంది. ఈ నది పేరు లోహిత్. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవహించే ఈ నది ని రివర్ ఆఫ్ బ్లడ్ అని పిలుస్తారు. అసలు ఈ నది లో నీళ్లు ఎరుపు రంగులో ఎందుకు ఉంటాయి? దీని వెనక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం...

23
ఈ నది ఎక్కడ వహిస్తుంది..?

లోహిత్ నది తూర్పు టిబెట్ లోని జాయల్ చూ పర్వత శ్రేణుల్లో ప్రవహిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లా ద్వారా భారత దేశంలోకి ప్రవహించి, సుమారు 200 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దట్టమైన అడవులు, లోతైన లోయల గుండా ప్రవహిస్తూ... ఈ నది చివరకు బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది.

ఈ నదిని బ్లడ్ ఆఫ్ రివర్ అని ఎందుకు పిలుస్తారు..?

ఈ నదిని బ్లడ్ ఆఫ్ రివర్ అని పిలవడం వెనక రెండు కారణాలు ఉన్నాయి.

భౌగోళిక కారణం: లోహిత్ లోయ, మిష్మి కొండలలో 'లాటరైట్' అనే ఇనుము సమృద్ధిగా ఉండే ఎర్రమట్టి ఉంటుంది. వర్షాకాలంలో ఈ మట్టి నది నీటిలో కలవడం వల్ల నీరు తుప్పు పట్టిన ఎరుపు లేదా రక్తపు రంగులోకి మారుతుంది.

పౌరాణిక గాథ: శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడు, తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని శిరచ్ఛేదం చేస్తాడు. ఆ మాతృహత్య పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి పరశురాముడు ఈ నదీ తీరంలో స్నానం చేయగా.. ఆయన తల్లి రక్తంతో ఈ నది నీరు ఎర్రగా మారిందని నమ్ముతారు.

పరశురామ కుండ్: పవిత్ర పుణ్యక్షేత్రం ఈశాన్య భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలలో పరశురామ కుండ్ ఒకటి.

కామ్ లాంగ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉండే ఈ క్షేత్రంలో, పరశురాముడు, శివునికి అంకితం చేసిన ఆలయానికి రాతి మెట్ల గుండా వెళ్లాలి.

మకర సంక్రాంతి మహోత్సవం: ప్రతి ఏటా జనవరి మధ్యలో మకర సంక్రాంతి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి, మోక్షం కోసం వేడుకుంటారు.

33
జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం..

జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ నది వెంట ప్రయాణిస్తుంటే.. జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది.

సూర్యుడి తొలి స్పర్శ పొందే నది: భారతదేశంలో అందరికంటే ముందుగా సూర్యోదయాన్ని చూసేది ఈ లోహిత్ నదీ పరివాహక ప్రాంతమే (డో గ్రామం). దేశంలోనే మొదటి సూర్యకిరణం ఈ రక్తపు రంగు నీటిపై పడినప్పుడు నది బంగారంలా మెరిసిపోతుంది. ఈ నది టిబెటిన్ హిమాలయాల్లో పుట్టి, అరుణాచల్ అడవులను చీల్చుకుంటూ వచ్చి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. దీని ప్రవాహం ఎంత ఉధృతంగా ఉంటుందంటే.. మైళ్ల దూరం వరకు దాని భయంకరమైన గర్జన వినబడుతుంది. ఈ నది ఒడ్డున మాత్రమే దొరికే 'మిష్మీ తీత' అనే అరుదైన మూలిక బంగారం కంటే విలువైనది. ఇది ప్రపంచంలో ఎక్కడా దొరకని అనేక వ్యాధులను నయం చేసే దివ్యౌషధం ఇక్కడ మాత్రమే లభిస్తుంది.

ఈ లోయలో ప్రయాణం ఎంత అందంగా, సాహసోపేతంగా ఉంటుందంటే... తేజు నుండి భారతదేశ చివరి సరిహద్దు గ్రామమైన వాలోంగ్ వరకు లోహిత్ నది పక్కన సాగే రోడ్డు ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతుంది.

ఒకవైపు నింగిని తాకే దట్టమైన పచ్చటి పర్వతాలు, రోడ్డుకి సరిగ్గా కింద కొన్ని వందల అడుగుల లోతులో ప్రవహించే ఎర్రటి నది, కంటిచూపు మేరలో పరుచుకునే తెల్లటి పొగమంచు.. ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే మనం మేఘాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది. ఈ నదిపై గిరిజనులు వెదురు, ఇనుప తీగలతో కట్టిన కిలోమీటర్ల పొడవైన ఊగే వంతెనలు ఉంటాయి. వాటిపై నడుస్తూ కింద ప్రవహించే నదిని చూడటం జీవితంలో మర్చిపోలేని అడ్వెంచర్.

Read more Photos on
click me!

Recommended Stories