3. అయోడిన్ టెస్ట్..
పనీర్‌లో స్టార్చ్ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అయోడిన్ టెస్ట్ చేయడం బెటర్.చిన్న పనీర్ ముక్కను నీటిలో ఉడికించి చల్లారిన తర్వాత దానిపై కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం వేస్తే, అది నీలం లేదా నలుపు రంగులోకి మారితే స్టార్చ్ ఉండే అవకాశం ఉందని చెబుతారు. అందులో కల్తీ జరిగిందని గుర్తించొచ్చు.
4. పెనంపై వేడి చేసి చూడండి
చిన్న పనీర్ ముక్కను నూనె వేయకుండా వేడి పెనంపై ఉంచి గమనించవచ్చు. నాణ్యమైన పనీర్ వేడెక్కినప్పుడు సాధారణంగా పాల ఉత్పత్తికి సంబంధించిన సహజమైన వాసనతో మెత్తగా మారుతుంది. అయితే పనీర్ అసహజంగా రబ్బర్‌లా మారడం, తీవ్రమైన వాసన రావడం లేదా అసాధారణంగా ఎక్కువ నూనె బయటకు రావడం కనిపిస్తే దాని నాణ్యతను ఒకసారి పరిశీలించండి.
5. గోరువెచ్చని నీటిలో వేసి చూడండి
చిన్న పనీర్ ముక్కను గోరువెచ్చని నీటిలో వేసి కొంతసేపు గమనించవచ్చు. పనీర్ వెంటనే ఆకారం కోల్పోవడం, అసాధారణంగా కరిగిపోవడం లేదా నీటిలో ఎక్కువ అవశేషాలు కనిపించడం జరిగితే అందులో కల్తీ జరిగిందని గుర్తించొచ్చు.
ఇంట్లో పరీక్షలు చేయడం కంటే నమ్మకమైన బ్రాండ్ లేదా విశ్వసనీయమైన విక్రేత నుంచి పనీర్ కొనడం మరింత ముఖ్యం. ప్యాక్ చేసిన పనీర్ అయితే తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల జాబితా, ప్యాకేజింగ్ సరిగ్గా ఉందో లేదో పరిశీలించండి.