ముఖ్యం బంగాళదుంపలకు సూర్యకాంతి లేదా డైరెక్ట్ వెలుతురు తగిలితే అవి త్వరగా ఆకుపచ్చగా మారి మొలకెత్తుతాయి. ఆకుపచ్చగా మారిన భాగంలో 'సోలనిన్' అనే విషపదార్థం తయారవుతుంది. అందువల్ల వీటిని ఎల్లప్పుడూ చీకటిగా, గాలి ధారాళంగా తగిలే చల్లటి ప్రదేశంలో ఉంచాలి.
ప్లాస్టిక్ సంచులు వాడకండి
మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లలోనే బంగాళదుంపలను ఉంచడం వల్ల లోపల తేమ చేరి అవి త్వరగా పాడవుతాయి. వీటిని గాలి తగిలే సంచులు, పేపర్ బ్యాగులు లేదా రంధ్రాలున్న ప్లాస్టిక్/వెదురు బుట్టల్లో మాత్రమే నిల్వ చేయాలి.
ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు
బంగాళదుంపలు త్వరగా పాడవకూడదని కొందరు వాటిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్‌లోని అతి శీతల ఉష్ణోగ్రత వల్ల బంగాళదుంపల్లోని పిండి పదార్థం (స్టార్చ్) చక్కెరగా మారిపోతుంది. దీనివల్ల వండినప్పుడు వాటి రుచి మారడమే కాకుండా, అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు అనారోగ్యకరమైన రసాయనాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
కొద్దిగా మొలకలు వచ్చిన బంగాళదుంపల విషయానికి వస్తే, ఆ భాగాలను కత్తిరించి వండుకోవచ్చు. కానీ ఎక్కువగా మొలకలు వచ్చి, మెత్తబడి ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలను వాడకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.