Drinkers Habits : మందు తాగేముందు రెండుమూడు చుక్కలు ఎందుకు చల్లేస్తారో తెలుసా? టాప్ 5 రీజన్స్ ఇవే

Published : Mar 24, 2025, 05:26 PM ISTUpdated : Mar 24, 2025, 05:31 PM IST

 మద్యం సేవించడం ప్రారంభించేముందు కొందరు రెండుమూడు చుక్కలను పారబోస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?

PREV
14
Drinkers Habits : మందు తాగేముందు రెండుమూడు చుక్కలు ఎందుకు చల్లేస్తారో తెలుసా? టాప్ 5 రీజన్స్ ఇవే
Drinkers Habits

Alcohol : మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మందుబాటిల్ పైనే రాసివుంటుంది... దాన్ని ఎవరూ పట్టించుకోరు. కానీ మందు తాగే సమయంలో చాలామంది ఏవేవో సెంటిమెంట్స్ పాటిస్తుంటారు. కొందరు శనివారం మందు ముట్టుకోరు.. మరికొందరేమో స్నానం చేసాకగానీ మద్యం సేవించరు. ఇలా ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని తెలిసినా మందు తాగడమే కాదు దానికి సెంటిమెంట్స్ కూడా జోడించారు. దీనివెనక వారి వ్యక్తిగత కారణాలు ఉండవచ్చు.

అయితే కొందరు మందుబాబులు కారణమేంటో తెలియకుండానే కొన్ని సెంటిమెంట్స్ పాటిస్తుంటారు. అలాంటిదే మందుతాగడం మొదలుపెట్టేముందు ప్రతిసారి రెండుమూడు చుక్కలు పక్కకు చల్లడం. కొందరు వేలిని మద్యంలో ముంచి నేలపై చల్లితే మరికొందరు గ్లాస్ ను వంపేస్తుంటారు. చాలామంది మందుప్రియులు దీన్ని ఫాలో అవుతుంటారు.  కానీ వీరిలో అత్యధికులకు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎక్కడో ఎవరో ఇలా చేయడం చూసివుంటారు... దీన్ని వీరుకూడా ఫాలో అవుతుంటారు. 

అయితే మందుతాగడం ప్రారంభించేముందు ఇలా రెండుచుక్కల మద్యం పారబోయడం వెనకున్న కొన్ని కారణాలు ఇటీవల ప్రచారం అవుతున్నాయి. సోషల్ మీడియాతో పాటు ఇతర మాద్యమాల్లో మందుబాబుల మద్య ఆసక్తికర చర్చ జరుగుతుంటాయి, అందులో ఇది కూడా ఒకటి. మందుతాగేముందు రెండుచుక్కలు చల్లడం వెనక ఎలాంటి శాస్త్రీయ కారణంలేదు... కానీ మందుబాబుల  చర్చ ప్రకారం ఇలా ఎందుకు చేస్తారో అనేది తెలుసుకుందాం. 

24
Drinkers Habits

1. పూర్వీకుల గౌరవార్థం రెండు మందుచుక్కలు : 

ఏదయినా కొత్తపని చేసేటప్పుడు లేదంటే కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు చాలామంది దేవుళ్లతో పాటు పూర్వీకులకు గుర్తుచేసుకుంటారు.  దేవుడికి పూజలుచేసి పూర్వీకులకు నివాళి అర్పిస్తారు. దీన్ని మద్యం సేవించే సమయంలో కూడా చాలామంది ఫాలో అవుతున్నారట.  

మన తెలుగోళ్ళు మరీముఖ్యంగా తెలంగాణ ప్రజలు కొన్ని ప్రత్యేక రోజుల్లో తమ పూర్వీకులకు కల్లు, మద్యం సమర్పిస్తుంటారు. వారి సమాధుల వద్ద మందుబాటిల్స్ పెడుతుంటారు. ఇలాగే మందు తాగేటపుడు కూడా పూర్వీకులకు గుర్తుచేసుకుని రెండుచుక్కలు వారికోసం నేలపై విసురుతుంటారట మద్యం ప్రియులు. 

2. దిష్టి తగలకుండా ఉండేందుకు రెండు మద్యచుక్కలు : 

చిన్నారులకు తల్లి గోరుముద్దలు తినిపించాక చివర్లో ఓ ముద్దను చిన్నారిచుట్టూ తిప్పి పారేస్తుంది.  అంటే తమ బిడ్డకు దిష్టి తగలకుండా ఉండేందుకు చాలామంది తల్లులు అలా చేస్తుంటారు. దీన్నే మందుబాబులు కూడా ఫాలో అవుతారట. మందు తాగుతుండగా ఎవరి దిష్టి తమకు తగలకూడదనే రెండు చుక్కలు అలా నేలపై చల్లుతారట. అంటే దిష్టి తగలడం వల్ల ఎక్కడ తమ కెపాసిటీ తగ్గుతుందో... ఎక్కడ మందు ఎక్కువగా తాగలేమోనన్న భయం అన్నమాట. 

కొందరు మందు ఎక్కువై వాంతులు చేసుకుంటారు... ఇలాంటివారు కూడా దిష్టి తగలడంవల్లే ఇలా జరిగిందని వాదిస్తుంటారు. శరీరం తట్టుకోలేని స్థాయిలో తాగడంవల్లే వాంతులు అవుతాయి... అంతేగానీ దిష్టి అనేది ఉండదు. కానీ మందుబాబులు తమకు మందు పడలేదంటే అస్సలు ఒప్పుకోరు. 

34
Drinkers Habits

3. మందులో హానికర పదార్ధాలను తొలగించేందుకు : 

మందులోని హానికర పదార్థాలను తొలగించేందుకు కొందరు ఇలా చేస్తారట. మందులో ఏవయినా ప్రమాదకరమైన కెమికల్స్, గ్యాస్ లు ఉంటే పోతాయనే ఇలా మొదటి గుటకకు ముందు కొంత పారబోస్తారట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు గానీ అసలు మందు తాగడమే ప్రమాదకరమని చెబితే మాత్రం మందుబాబులు నమ్మరు. 

బీరును గ్లాస్ లో వేసే సమయంలో పైన నురగ వస్తుంది. దాన్ని తొలగించేందుకు కూడా కొందరు వేలుపెట్టి తిప్పి కొంత చల్లుతుంటారు. అలాగే కొందరు మద్యంలో విష పదార్థాలను తొలగిస్తాయని కొన్ని పదార్థాలను కలుపుకుని తాగుతుంటారు. 

4. దేవుళ్ల కోసం రెండు మద్యంచుక్కలు :  

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా గ్రామ దేవుళ్లకు నైవేధ్యంగా మందును సమర్పిస్తుంటారు. తెలంగాణలో మందుతో పాటు కల్లును కూడా గ్రామదేవతల పూజల్లో వాడుతుంటారు. కల్లు సాకపోసి దేవుడికి మొక్కు చెల్లించుకుంటారు. మందు తాగేముందు కూడా ఇలాగే మొదట దేవుళ్లను సమర్పిస్తారట... అందుకే రెండు చుక్కలు పారబోస్తారు. కొందరు మందుబాబుల అయితే మందు బాటిల్ కు దండం పెట్టుకుని ఓపెన్ చేస్తుంటారు. 

44
Drinkers Habits

5. భూమి కోసం : 

మనల్ని మోయడమే కాదు బ్రతికేందుకు ఆహారం అందిస్తున్న భూమిని దేవుళ్లుగా భావించి పూజిస్తుంటాం. మందుబాబుల కూడా ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతారట. మందు తాగేముందు రెండుచుక్కలు భూమికి సమర్పిస్తుంటారట. 

అయితే చాలామంది తాగేముందు మద్యాన్ని ఎందుకు చల్లుతారో తెలియకుండానే ఇలా చేస్తుంటారు. ఎక్కడో ఎవరో చేస్తుండగా చూసి ఇలా చేసేవారు మరికొందరు. కారణం తెలిసి కొందరు, తెలియక కొందరు మందుబాబులు రెండుచుక్కలు మద్యం పక్కన పారబోయండాన్ని ఓ సెంటిమెంట్ గా మార్చుకున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories