Pillow: మీ దిండ్లు పసుపు రంగులోకి మారిపోయాయా?రూ.10ఖర్చుతో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు

Published : Aug 24, 2026, 10:36 AM IST

Pillow: చాలా కాలం నుంచి వాడటం వల్ల.. మన దిండ్లు.. పసుపు రంగులోకి మారిపోతాయి. అలా మారిన వాటిని శుభ్రం చేయలేక చాలా మంది పడేస్తూ ఉంటారు. కానీ, సింపుల్ పద్దతిలో మీ పాత దిండ్లను ఈజీగా కొత్తవాటిలా మార్చేయచ్చు.

PREV
13
Pillow Cleaning

Pillow: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం శుభ్రంగా ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. అందుకోసమే.. రెగ్యులర్ గా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దుప్పట్లు, దిండ్లు శుభ్రం చేస్తూనే ఉంటారు. అయితే... ఎంత శుభ్రం చేసినా కూడా.. దిండు కవర్ తీసి చూస్తే.. దిండ్లు పసుపు రంగు లోకి లేదా గోధుమ రంగులోకి మారి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి.ఇలాంటి దిండ్లను చూసి చాలామంది పనికిరావని పారేస్తుంటారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే చిన్న చిన్న వస్తువులతో వాటిని మళ్లీ కొత్తవాటిలా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

23
దిండ్లు పసుపు రంగులోకి ఎందుకు మారతాయి?

మనం నిద్రపోతున్నప్పుడు శరీరం నుండి సహజంగా వెలువడే చెమట, చర్మం , జుట్టులోని నూనె జిడ్డు దిండు కవర్‌ను దాటుకుని లోపలి దూదిలోకి ఇంకిపోతాయి. ఇవే కాకుండా రాత్రి వేళల్లో రాసుకునే ఫేస్ క్రీములు, లోషన్లు, తడి జుట్టు , లాలాజలం వల్ల కాలక్రమేణా పసుపు మరకలు ఏర్పడతాయి. ఈ తేమ వల్ల దిండ్లలో దుమ్ము, బ్యాక్టీరియా చేరి దుర్వాసన రావడం మొదలవుతుంది.

33
ఈ పసుపు మరకలను వదిలించే 2 సులువైన పద్ధతులు

1. బేకింగ్ సోడా + వెనిగర్ చిట్కా:

బేకింగ్ సోడా, నీటిని సమాన నిష్పత్తిలో కలిపి పేస్ట్‌లా తయారు చేయండి.

ఈ పేస్ట్‌ను పసుపు మరకలు ఉన్న చోట రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

ఆ తర్వాత కొద్దిగా తెల్ల వెనిగర్ చల్లి, వాషింగ్ మెషీన్‌లో ఉతికితే మరకలన్నీ మాయమైపోతాయి. (గమనిక: ఒకవేళ మీది మెమరీ ఫోమ్ లేదా లేటెక్స్ దిండు అయితే ఉతకకుండా, తడి గుడ్డతో సున్నితంగా తుడిచి ఎండలో ఆరబెట్టాలి).

2. నిమ్మరసం + ఎండ (సహజమైన బ్లీచింగ్):

ఒక భాగం నిమ్మరసానికి రెండు భాగాల గోరువెచ్చని నీరు (లేదా తెల్ల వెనిగర్) కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి.

ఈ మిశ్రమాన్ని దిండుపై స్ప్రే చేసి కొన్ని గంటల పాటు బాగా ఎండలో ఉంచండి.

సూర్యరశ్మిలోని UV కిరణాలు సహజమైన బ్లీచ్‌లా పనిచేసి మరకలను, దుర్వాసనను పూర్తిగా తొలగిస్తాయి.

దిండ్లు పసుపు పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు..

పిల్లో ప్రొటెక్టర్ వాడండి: దిండు కవర్ వేసే ముందు లోపల 'వాటర్‌ప్రూఫ్ పిల్లో ప్రొటెక్టర్' వాడితే చెమట, నూనెలు లోపలికి ఇంకవు. అంతేకాకుండా, దిండు కవర్లను వారానికి ఒకసారి, లోపలి దిండ్లను ప్రతి 3 నుండి 6 నెలలకొకసారి శుభ్రం చేయాలి. ఎంత శుభ్రం చేసినా ఆరోగ్య దృష్ట్యా ప్రతి 2 సంవత్సరాలకొకసారి పాత దిండ్లను తీసేసి కొత్తవి వాడటం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories