దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దానిమ్మ రసంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని, ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది.
దానిమ్మలో ఉండే నైట్రిక్ యాసిడ్, ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది. 70 శాతానికి పైగా కొలెస్ట్రాల్‌ను తొలగించే సామర్థ్యం దానిమ్మకు ఉందని నిపుణులు చెబుతున్నారు.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ జ్యూస్‌ను రోజూ తాగే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. దానిమ్మ, దాని రసంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణాలు ఉన్నప్పటికీ, దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.