రోజూ ఉదయాన్నే పరగడుపున తులసి ఆకుల నీళ్లు 30 రోజుల పాటూ తాగి చూడండి. మీరు ఊహించని మార్పులు మా ఆరోగ్యంలో, శరీరంలో కనిపిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. తులసిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.