ఇలా నడిస్తేనే వేగంగా బరువు తగ్గుతారు.. లేదంటే లావుగానే ఉంటారు..

Published : Aug 30, 2022, 12:01 PM IST

నడక ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. అందులోనూ ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని పలు పరిశోధనలు కూడా వెల్లడించాయి. అయితే ఈ నడక సరిగ్గా ఉంటేనే బరువు తగ్గుతారన్న సంగతి మీకు తెలుసా..?   

PREV
18
 ఇలా నడిస్తేనే వేగంగా బరువు తగ్గుతారు.. లేదంటే లావుగానే ఉంటారు..
walking

కఠినమైన వ్యాయామాలతో పోల్చితే.. నడక కూడా బరువును తగ్గించడంలో బాగానే సహాయపడతుంది. వ్యాయామాలు చేసేంత సమయం లేని వారు ఖచ్చితంగా రోజులో కొంత సమయం నడకకు కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ నడకకు పెద్దగా శక్తి అవసరం లేదు. అయితే బరువు తగ్గడానికి నడిచే వారు.. నడక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయితేనే వేగంగా బరువు తగ్గుతారు. నడకలో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం పదండి.. 
 

28

నడిచేటప్పుడు ముందుకు వంగకూడదు

చాలా మంది నడిచేటప్పుడు ముందుకు వంగి నడుస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. నిటారుగా కూర్చోవడం ఎంత కష్టమో.. నడిచేటప్పుడు శరీరాన్ని ముందుకు వంచకుండా నడవడం కూడా అంతే కష్టం. కానీ నిటారుగా నడిస్తేనే మీరు పాస్ట్ గా బరువు తగ్గుతారు. వంగినడవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల వెన్నుముక నొప్పి పెడుతుంది. 
 

38
morning walking

కిందికి చూడకూడదు

నడిచేటప్పుడు కిందికి చూసే అలవాటును మానుకోండి. మీరు నడుస్తున్నప్పుడు తలను పైకి ఉంచి నిటారుగా చూడండి. దీంతో మీ భుజాలు, వెన్నెముక నిటారుగా మారుతాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే నడుస్తున్నప్పుడు ఫోన్ ను చూడకండి. నడిచేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండని నిపుణులు సలహానిస్తున్నారు. 
 

48

చేతులను అతిగా ఊపకండి

చాలా మంది నడిచేటప్పుడు ఎక్కువగా ఊపుతుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. చేతులను మరీ ఎక్కువగా స్వింగ్ చేస్తే భుజం కీళ్లు దెబ్బతింటాయి. నిజానికి వాకింగ్ చేసేటప్పుడు చేతులను ఊపడం  అవసరమే. అయితే వాటిని సున్నితంగానే ఊపండి. 
 

58
walking

అడుగులు పెద్దగా వేయకూడదు

కొంతమంది చిన్న చిన్న అడుగులు వేస్తే.. మరికొంతమంది మాత్రం కాళ్లను ఎక్కువగా సాగదీసి పొడవైన అడుగులు వేస్తారు. దీనివల్ల తక్కువ టైం లో ఎక్కువ దూరం వెళతారని భావిస్తారు. కానీ ఇలా నడవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల జాయింట్స్ ప్రభావితమవుతాయి. అరుగుదల సమస్య బారిన పడే అవకాశం ఉంది. 

68

 

సరైన షూలే వేసుకుని నడవాలి

మరీ టైట్ గా లేదా వదులుగా ఉండే బూట్లు కాళ్లపై.. చీలమండల ప్రాంతంపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తాయి. అందుకే మీకు ఫిట్ గా, నడిచేందుకు కంఫర్ట్ గా ఉండే షూలనే వేసుకోండి. 
 

78

ఎలా నడుస్తున్నారు

మీరు నడిచే విధానం మీ కండరాలకు ఎలాంటి నొప్పిని కలిగించకుండా ఉండాలి. మీరు నడిచేటప్పుడు మీ పాదాలు మొదట మడమతో నేలను తాకాలి. ఆ తర్వాత బొటనవేలితో పాదాన్ని పైకి నెట్టాలి. ఇదే సరైన నడక.

88

ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలనుకునేవారికి సాధారణ నడక కంటే.. ఒక 10 నిమిషాల పాటు చురుగ్గా నడిస్తే బెరట్ రిజల్ట్స్ ను పొందుతారు. అంటే బాడీ మొత్తం కదిలేలా నడవాలన్న మాట. ఈ స్థితిలో కండరాలు ఎక్కువ కష్టపడాలి. అంటే ఒక గంటలకు 3 మైళ్ల వేగంతో నడవాలన్న మాట. 10 నిమిషాల brisk వాకింగ్ లో 90 కేలరీలను కోల్పోతారు. ఈ నడకలను వారిని 150 నిమిషాలు నడవాలని నిపుణులు సలహానిస్తున్నారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories