కళ్లు, చర్మం కూడా మీ కిడ్నీల ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాయి.. ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి..

Published : Aug 30, 2022, 10:56 AM IST

శరీరంలోని విషాన్ని, రక్తాన్ని శుద్ధి చేయడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే.. శరీరం సక్రమంగా పనిచేస్తుంది. లేదంటే ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది.  

PREV
16
కళ్లు, చర్మం కూడా మీ కిడ్నీల ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాయి.. ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి..

మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను, అదనపు ద్రవాలను తొలగిస్తాయి. అలాగే శరీర కణాల్లో ఉత్పత్తి అయ్యే ఆమ్లాన్ని కూడా తొలగిస్తాయి. మూత్రపిండాలు రక్తంలోని కాల్షియం, సోడియం, భాస్వరం, పొటాషియం వంటి నీరు, భాగాల సమతుల్యతను నిర్వహించడానికి కూడా పనిచేస్తాయి. మూత్రపిండాల్లో ఏ సమస్య వచ్చినా.. ఎన్నోఅనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే.. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. 
 

26

మూత్రపిండాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారం మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచేవి అయి ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారంతోనే మూత్రపిండాలు మరింత మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. ఒక వేల మీ మూత్రపిండాలు దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మూత్ర సమస్యలు సాధారణంగా మూత్రపిండాల వైఫల్యం లక్షణాలుగా పరిగణించబతాయి. అయితే ఈ మూత్రపిండాల దెబ్బతిన్నాయన్న సంగతిని మీ చర్మం, కళ్లు కూడా చెప్తాయంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం పదండి..
 

36

చర్మ సమస్యలు

మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే చర్మంపై పొడిబారుతుంది. పొరలు పొరలుగా తయారవుతుంది. అలాగే చర్మంపై దురద పెడుతుంది. వాస్తవానికి మూత్రపిండాలు మన రక్తంలోని విషాన్ని ఫిల్టర్ చేసి చర్మానికి స్వచ్ఛమైన రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఒక వేళ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. మన రక్తంలో విషతుల్యాలు పెరగడం వల్ల ఒక్కోసారి ప్రాణాల మీదికి కూడా వస్తుంది.
 

46

కంటి సమస్యలు

మూత్రపిండాలు దెబ్బతింటే కంటి సమస్యలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కళ్ల చుట్టూ వాపు వస్తుంది. ఎందుకంటే మూత్రపిండాలు సరిగ్గా పనిచియకపోవడం వల్ల శరీరంలో ఉండే అదనపు సోడియం పేరుకుపోతుంది. దీనివల్లే కళ్ల చుట్టూ వాపు వస్తుంది. 

56

మూత్రవిసర్జన

మూత్ర విసర్జనలో మార్పులు కూడా మూత్రపిండాల ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. రోజులా కాకుండా.. తరచుగా మూత్రం రావడం లేదా తక్కువగా రావడం వంటివి కూడా మూత్రపిండాలు దెబ్బతిన్నాయన్న సంగతిని తెలియజేస్తాయి. 
 

66

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే.. శరీరానికి హానిచేసే ట్యాక్సిన్స్ శరీరంలో పేరుకుపోతాయి. ముఖ్యంగా ఖనిజాలు శరీరంలో పేరుకుపోవడం వల్ల కండరాల్లో నొప్పి పుడుతుంది. ఈ నొప్పి ఎన్నోఅంతర్గత జబ్బులకు కారణం కావొచ్చు. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.  

Read more Photos on
click me!

Recommended Stories