డైలీ వైట్ రైస్ నే తింటున్నారా? అయితే కన్ఫామ్ మీకు ఈ రోగాలు వచ్చుంటయ్..

Published : Jun 02, 2022, 04:54 PM IST

వైట్ రైస్ ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటుగా ప్రమాదకరమైన గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
17
డైలీ వైట్ రైస్ నే తింటున్నారా? అయితే కన్ఫామ్ మీకు ఈ రోగాలు వచ్చుంటయ్..

బ్రైన్ రైస్, బ్లాక్ రైస్ అంటూ మార్కెట్ లో ఎన్నో రకాల బియ్యాలు లభిస్తాయి. వీటన్నింటికంటే వైట్ రైస్ నే ఎక్కువగా తినే వారు చాలా మందే ఉన్నారు. నిజానికి చూడటానికి తెల్లగా ఉన్నా.. వైట్ రైస్ ను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా దీన్ని ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. 
 

27

అంతేకాదు వైట్ రైస్ ను మధుమేహులు తినకపోవడమే మంచిది. దీనిని వీళ్లు తింటే వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవేకావు మరెన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేంటంటే.. 

37

గుండెపోటు వచ్చే అవకాశం: మనం తినే వైట్ రైస్ లో ఎలాంటి ముఖ్యమైన పోషకాలు ఉండవు.  మీడియా నివేదికల ప్రకారం.. అన్నాన్ని ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి వైట్ రైస్ ను ఎక్కువగా తినే అలవాటును మానుకోవాలి. లేకపోతే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 

47

శరీరంలో పోషకాల లోపం ఏర్పడవచ్చు: అన్నాన్ని ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో పోషకాల లోపం ఏర్పడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ ఆరోగ్య స్థితి, మీ వయస్సు ను బట్టీ మీ రోజు వారి ఆహారంలో రకరకాల పండ్లను, కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఈ వైట్ రైస్ కు బదులుగా బ్రైన్ రైస్ ను తినొచ్చు. 
 

57

రక్తంలో చక్కెర స్థాయి పెరగొచ్చు: వైట్ రైస్ ను తినడం వల్ల డయాబెటీస్ ప్రమాదం మరింత పెరుగుతుంది. అందుకే దీనిని తినడం తగ్గంచండని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 

67

మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య: వైట్ రైస్ ను తినడం వల్ల మెటబాలిక్ సండ్రోమ్ సమస్య రావొచ్చంటున్నారు నిపుణులు. అందుకే వైట్ రైస్ ను నెలకు ఒకసారి మాత్రమే తినాలని సూచిస్తున్నారు. ఇది జీవక్రియ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. 
 

77

బరువు పెరగొచ్చు: ఊబకాయంతో బాధపడేవారు వెంటనే తెల్ల అన్నాన్ని తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది బరువును మరింత పెంచుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories