ముఖంపై ముడతలు పోయి.. అందంగా కనిపించాలంటే.. ఐస్ క్యూబ్స్ తో ఇలా చేయండి..

Published : Jun 02, 2022, 03:00 PM IST

ఐస్ క్యూబ్స్ మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఐస్ క్యూబ్స్ ను ముఖంపై అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటుగా మీ ముఖం అందంగా మారుతుంది.  

PREV
19
ముఖంపై ముడతలు పోయి.. అందంగా కనిపించాలంటే.. ఐస్ క్యూబ్స్ తో ఇలా చేయండి..

ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మొదలైన వాటి వల్ల చాలా మంది చర్మం సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖంపై మొటిమలు, ఫైన్ లైన్స్,  ముడతలు, రంధ్రాలు, నల్లటి వలయాలు మొదలైన సమస్యలతో సతమతమవుతున్నారు. మార్కెట్ లో దొరికే రకారకాల ప్రొడక్ట్స్ తో వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేసినా.. అందులో కెమికల్స్ చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాగా ఇంటి చిట్కాలతో ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయొచ్చు. అది కూడా ఐస్ క్యూబ్స్ తో. ఐస్ క్యూబ్స్ మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసుకుందాం పదండి.

29

ముఖం తక్షణమే మెరిసేలా చేస్తుంది:  ముఖానికి ఐస్ క్యూబ్స్ ను అప్లై చేయడం వల్ల చర్మం ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. ముఖంపై దుమ్ము వల్ల కలిగే మంటను ఐస్ ఉపశమనం కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ముఖంపై ఐస్ ను ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 

39

మొటిమలను తగ్గిస్తుంది: మొటిమలపై ఐస్ క్యూబ్స్ ను అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ముఖంపై ఉండే  మొటిమల రంధ్రాలను తగ్గిస్తుంది. ముఖంపై అధికంగా నూనె ఉత్పత్తి అయ్యే సమస్య కూడా పోతుంది.

49

ఉత్పత్తి శోషణను పెంచుతుంది:  మీ చర్మంపై వివిధ ఉత్పత్తులను అప్లై చేయడానికి ముందు ఐస్ క్యూబ్స్ ను రుద్దడం వల్ల మీరు ఉపయోగిస్తున్న ఉత్పత్తులు చర్మం యొక్క లోతైన పొరలను చేరుకోవడానికి, బాగా శోషించుకోవడానికి సహాయపడుతుంది.

59

కంటి చుట్టూ వాపును తగ్గిస్తుంది:  ముఖంపై ఐస్ ను క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల విస్తరించిన రక్తనాళాలను కుదించుకుపోయి.. వాపు తగ్గుతుంది. ఇది కళ్ల క్రింద వాపును వదిలించుకోవడానికి ఐస్ క్యూబ్స్ చక్కటి మెడిసిన్ లా సహాయపడుతుంది.

69

వృద్ధాప్య చిహ్నాలను తగ్గిస్తుంది:  ఐస్ క్యూబ్స్ చర్మ రంధ్రాలను టైట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ముడతలను, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది. తద్వారా మీ చర్మం దృఢంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
 

79

సన్ స్పాట్స్, దద్దుర్లను నయం చేస్తుంది:  వడదెబ్బకు చికిత్స చేయడానికి ఐస్ క్యూబ్స్ అప్లై చేయడం ఉత్తమ మార్గం. ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గుతాయి. 

89

ముఖంపై ఐస్ ను ఎలా అప్లై చేయాలి:  చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఐస్ ని సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇందుకోసం మీరు కొన్ని ఐస్ క్యూబ్స్ ను తీసుకుని సన్నని వాష్ క్లాత్ లేదా టవల్ లో చుట్టి మీ ముఖానికి అప్లై చేయవచ్చు. మీ చర్మానికి అదనపు పోషకాలను అందించడానికి మీరు టొమాటో గుజ్జు, కలబంద రసం, దోసకాయ రసం వంటి పదార్థాలను ఐస్ ట్రేలో పెట్టొచ్చు. రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు మీ చర్మంపై ఐస్ ను అప్లై చేయొద్దు

99

ఐస్ ప్యాక్ లేదా క్యూబ్ ని మీ ముఖం యొక్క ఒక నిర్ధిష్ట ప్రాంతంలో ఒక నిమిషం కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు. మీ కళ్ళ చుట్టూ ఐస్ క్యూబ్స్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా వాటిలో ఏదైనా ప్రత్యేక పదార్థాలు ఉంటే.. కళ్ల కింద చాలా గట్టిగా రుద్దవద్దు. మసాజ్ చేస్తే మంచి ఫలితాలొస్తాయి. ఐస్ అప్లై చేసేటప్పుడు చర్మం మండుతున్నట్టు అనిపిస్తే వెంటనే ఐస్ క్యూబ్స్ ను పెట్టడం ఆపేసి డాక్టర్ ను సంప్రదించడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories