Diabetes: మధుమేహులు ఈ పండ్లను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి..

Published : Jun 02, 2022, 03:44 PM IST

Diabetes: మధుమేహులు పైనాపిల్, మామిడి వంటి కొన్ని పండ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే కొన్నిరకాల పండ్లు మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. 

PREV
16
Diabetes: మధుమేహులు ఈ పండ్లను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి..

మధుమేహులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ (Sugar levels) విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. 

26

అయితే మధుమేహులు అన్నిరకాల పండ్లను తినలేరు. ఎందుకంటే కొన్ని రకాల పండ్లు వీరి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇంతకి డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి పండ్లను తింటే మంచిదో తెలుసుకుందాం పదండి. 

36

కివీస్ (Kiwis): కివిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఆన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటుగా విటమిన్ సి, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా తినాల్సిన పండు ఇది. వీటిని అలాగే లేదా జ్యూస్ గా చేసుకుని కూడా తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల డయాబెటీస్ పేషెంట్లు ఆరోగ్యంగా ఉంటారు. 

46

బెర్రీస్ : వేసవిలో బెర్రీలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండును డయాబెటీస్ పేషెంట్లు ఖచ్చితంగా తినాలనలి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు దీన్ని తినడం వల్ల వీరి రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. దీని విత్తానాలను పొడి చేసుకుని తీసుకోవడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 

56

ఆరెంజ్ (Orange): నారింజలల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండు డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. 

66

జామకాయ : జామ పండ్లు మధుమేహులకు చాలా మంచివి. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 
 

click me!

Recommended Stories