White Hair Problem: తెల్లజుట్టుకు రంగులు వేయడం ఆపండి.. వీటిని తిన్నా మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది..

Published : Jul 04, 2022, 12:39 PM ISTUpdated : Jul 04, 2022, 12:40 PM IST

White Hair Problem: 40, 45 ఏండ్లలో రావాల్సిన తెల్ల జుట్టు ఇప్పుడు 20 ఏండ్లలోపు వారికి కూడా వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే తెల్ల జుట్టు కాస్త నల్లగా మారిపోతుంది. 

PREV
18
White Hair Problem: తెల్లజుట్టుకు  రంగులు వేయడం ఆపండి.. వీటిని తిన్నా మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది..

ఒకప్పుడు తెల్ల జుట్టు వయసు మీద పడుతున్న వారికి మాత్రమే వచ్చేది. అయినా వయసు మీద పడుతున్న వారికి తెల్లవెంట్రుకలు రావడం చాలా సహజం కూడా. . అయితే ఈ రోజుల్లో మాత్రం తెల్ల జుట్టు ముసలివాళ్లకే కాదు పిల్లలకు, యువతకు కూడా వస్తోంది. దీనికి కారణం జుట్టును నల్లగా ఉంచే మెలనిన్ అనే వర్ణద్రవ్యం లోపం ఏర్పడటమే. 

28

ఈ వర్ణద్రవ్యం వయసు మీద పడుతున్న వారిలోనే తక్కువగా ఉండేది. కానీ జీవన శైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసు వారికి కూడా తెల్ల జుట్టు వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే తెల్లజుట్టు మునపటిలా నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38

బ్రోకలీ (Broccoli)

బ్రోకలీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరగాయ ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటి. దీనిలో పుష్కలంగా ఉండే ఫోలిక్ యాసిడ్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ముందుగానే తెల్లజుట్టు రాకుండా నిరోధిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల తెల్లజుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.
 

48

కరివేపాకు (curry leaves)

కరివేపాకు మన ఆరోగ్యానికి ఎన్నో విధాల సహాయపడుతుంది. దీనిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ఆకులను తినడం లేదా.. హెయిర్ ఆయిల్ తో కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు కొద్ది రోజుల్లోనే నల్లగా మారుతుంది. 

58

ఆకు కూరలు (Leafy vegetables)

ఆకు కూరలను తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది. దీనిలో జుట్టును నల్లగా మార్చే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు చిన్న వయసులో తెల్లబడటాన్ని ఆపుతుంది. ఇందుకోసం మీరు బచ్చలి కూర, మెంతి కూర, కొత్తిమీర వంటి కూరగాయలను రోజూ తినాలి. 
 

68

కాపర్, ఐరన్ (Iron)ఫుడ్స్

కాపర్, ఐరన్ మన శరీరానికి ఎంతో అవసరం. ఇవి మన శరీరానికి కావాల్సిన అతిముఖ్యమైన పోషకాలు కూడా. ఈ రెండు పోషకాల లోపం ఏర్పడితేనే చిన్న వయసులో తెల్లజుట్టు వస్తుంది. అందుకే ఈ పోషకాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంపలు, వాల్ నట్స్, పుట్టగొడుగులు వంటి ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. 

78

బ్లూబెర్రీ (Blueberry)

బ్లూబెర్రీలల్లో విటమిన్ బి12, అయోడిన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తింటే తెల్లజుట్టు నల్లగా మారడంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

88

అవకాడో (Avocado)

అవకాడోను తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఇది తెల్లజుట్టును నల్లగా మార్చడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిని మీ రోజు వారి ఆహారంలో బాగం చేసుకుంటే తెల్లజుట్టు కొద్ది రోజుల్లోనే మటుమాయం అవుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories