వానాకాలం మొదలైంది. దీంతో ప్రతిరోజూ వానలు పడుతూనే ఉంటాయి. బట్టలు ఉతికేసినా ఆరని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బట్టల నుంచి దుర్వాసన వస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ వాసనకు చెక్ పెట్టొచ్చు.
వానాకాలంలో బట్టలను ఆరబెట్టడం పెద్ద తలనొప్పి అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ లో సరిగ్గా ఎండ రాదు. దీంతో ఉతికేసిన బట్టలు మూడు నాలుగు రోజులకు కూడా ఆరవు. నీడ, తేమ వాతావారణంలో బట్టలు ఆరడం కష్టం. దాంతో బట్టల నుంచి దుర్వాసన వస్తుంటుంది.
26
bad smell
పొరపాటున ఈ బట్టలను వేసుకున్నా.. వాటివల్ల చర్మంపై ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఈ వానాకాలంలో బట్టలను నుంచి దుర్వాసనను దూరం చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
36
బేకింగ్ సోడా
ఈ సీజన్ లో డిటర్జెంట్ పౌడర్ తో బట్టలను ఉతికినా.. వాటినుంచి మంచి స్మెల్ రాకపోతే.. బట్టలను ఉతికేటప్పుడు లాండ్రీ పౌడర్ తో పాటుగా నీటిలో కొద్దిగా వెనిగర్ కలపండి. ఇది బట్టల దుర్వాసనను వదిలించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇలా వద్దనుకుంటే బట్టల్లో ఏ ప్లేస్ లో అయితే వాసన వస్తుందో అక్కడ బేకింగ్ సోడాను స్ప్రింకిల్ చేసినా దుర్వాసన మటుమాయం అవుతుంది.
46
వెనిగర్
వెనిగర్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ వెనిగర్ కూడా బట్టల నుంచి దుర్వాసనను వదిలించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నీళ్లలో కొంచెం వెనిగర్ వేసి అందులో కొద్ది సేపు బట్టలను నానబెట్టి ఉతికేస్తే వాసన మటుమాయం అవుతుంది. అలాగే ఏ బట్టలకైతే బూజు వచ్చిందో ఆ ప్లేస్ వెనిగర్ ను అప్లై చేసి వాష్ చేసినా శుభ్రంగా మంచి వాసన వస్తాయి.
56
నిమ్మరసం: వానాకాలంలో బట్టలు సరిగ్గా ఆరవు. దాంతో బట్టల్లో తేమ అలాగే ఉంటుంది. అందుకే బట్టల నుంచి మురికి వాసన వస్తుంది. నిమ్మరసం బట్టల దుర్వాసనను వదిలిస్తుంది. ఇందుకోసం బట్టలను ఉతికేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలపండి. దీంతో దుర్వాసన తొలగిపోతుంది.
66
తడి బట్టలను, పొడి బట్టలను వేరు చేయాలి
వానాకాలంలో తడి బట్టలను, పొడి బట్టలను ఎప్పుడూ సపరేట్ గానే ఉంచాలి. కలిపి ఉంచితే రెండూ దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. వాసన లేకుంటేనే బట్టల్లో తేమ తొందరగా పోతుంది.