ఈ సీజన్ లో మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే కొన్ని ఆహారాలు
jamun
వర్షాకాలంలో మాత్రమే ఈ పండ్లు లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఆయుర్వేదంలో కూడా ఈ పండుకు గొప్ప స్థానం ఉంది. వీటిని తినడం వల్ల కడుపు నొప్పి (Stomach ache), గుండె జబ్బులు (Heart diseases), ప్రేగు సమస్యలు (Bowel problems), ఆస్తమా, డయేరియా వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఇవి మూత్రపిండాల నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ (Fiber) జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుంతుంది.