Saffron Capital: మన దేశపు కుంకుమ పువ్వు రాజధాని ఇదే...విదేశాల నుంచి కూడా ఇక్కడి నుంచే సరఫరా..!

Published : Nov 25, 2026, 03:48 PM IST

Saffron Capital: భారతీయ వంటలకు రిచ్ నెస్ తెచ్చే కుంకుమ పువ్వు... మన దేశంలో ఎక్కడ ఎక్కువ పండుతుందో తెలుసా? ప్రత్యేకంగా కుంకుమ పువ్వు కి మన దేశంలో రాజధాని ఎక్కడ ఉందో తెలుసా?

PREV
13
కుంకుమ పువ్వుకు కేరాఫ్ అడ్రస్..

భారతీయ సంస్కృతిలో.. కుంకుమ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా రకాల వంటలకు అద్భుతమైన సువాసన, గాఢమైన రంగు, సున్నితమైన రుచి అందిస్తుంది. దీని కారణంగా, ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న సుగంధ ద్రవ్యాలలో ఇది ఒకటిగా నిలిచింది. కేవలం రెండు మూడు కుంకుమ పువ్వు రేకులు వేస్తే చాలు... ఆ వంటకు మంచి రిచ్ నెస్ తీసుకువస్తుంది. అంతేకాదు.. మన దేశంలో గర్భిణీ స్త్రీలు పాలల్లో ఈ పువ్వు రేకలను కలుపుకొని కూడా తాగుతూ ఉంటారు. మరి, ఈ అరుదైన పంటను మన దేశంలో పెద్ద ఎత్తున పండించే ప్రదేశం ఏది? కుంకుమ పువ్వు రాజధానిగా పిలిచే పట్టణం ఏదో దాని వివరాలు ఇప్పుడు చూద్దాం...

23
భారతదేశపు కుంకుమ పువ్వు రాజధాని.... పాంపోర్..

కాశ్మీర్ లోయలో ఉన్న పాంపోర్ పట్టణంలో శతాబ్దాలుగా కుంకుమ పువ్వును సాగు చేస్తున్నారు. దీనిని కుంకుమ పువ్వు రాజధానిగా పిలుస్తారు. అక్కడి ప్రత్యేక వాతావరణం, సారవంతమైన నేల, ఎత్తైన పీఠభూములు ఈ సున్నితమైన పంట సాకుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కుంకుమ పువ్వులో దాదాపు మొత్తం పాంపోర్, దాని చుట్టుపక్కన ప్రాంతాల్లోనే పండుతుండటం విశేషం. ప్రతి సంవత్సరం చలికాలంలో... ఇక్కడి పొలాలన్నీ పర్పుల్ రంగు కుంకుమ పువ్వులతో నిండిపోయి, కాశ్మీర్ లోనే అత్యంత కనువిందు చేసే ప్రాంతంగా మారిపోతాయి. ఈ సమయంలో ఈ ప్రాంతం చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు.

33
పాంపోర్ కుంకుమ పువ్వు ఎందుకు అంత స్పెషల్...

ప్రపంచంలోనే అత్యంత శ్రమతో కూడుకున్న వ్యవసాయ పద్ధతుల్లో కుంకుమపువ్వు సాగు ఒకటి. పాంపోర్ కుంకుమపువ్వుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి రంగు చాలా అందంగా.. మంచిగా ఎర్రగా ఉంటాయి. వీటికి సహజమైన, బలమైన వాసన ఉంటుంది. వీటిలో క్రోసిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్లే దీనికి అద్భుతమైన రంగు వస్తుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది.

ప్రతి కుంకుమపువ్వు చాలా తక్కువ సమయం మాత్రమే వికసిస్తుంది. ఆ పూలలోని రేకులను ఎంతో జాగ్రత్తగా చేతితో ఏరి, ఆరబెట్టి ప్రాసెస్ చేస్తారు. కొద్దిపాటి కుంకుమపువ్వు తయారు చేయడానికి వేలాది పూలు అవసరమవుతాయి. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఇది ఒకటిగా నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు...

పాంపోర్‌లో పండే కుంకుమపువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ రకాల్లో ఒకటిగా పేరుగాంచింది. దీని విశిష్ట నాణ్యతకు గుర్తింపుగా 2020లో కశ్మీర్ కుంకుమపువ్వుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI Tag) లభించింది.

ఇరాన్, స్పెయిన్, గ్రీస్ వంటి దేశాల్లో కూడా కుంకుమపువ్వు సాగు చేస్తున్నప్పటికీ, భారతదేశపు కుంకుమపువ్వు సాగుకు పాంపోర్ తిరుగులేని కేంద్రంగా నిలిచింది. తరతరాలుగా ఇక్కడి రైతు కుటుంబాలు ఎంతో నైపుణ్యంతో, సంప్రదాయ పద్ధతుల్లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ సుగంధ ద్రవ్యాన్ని పండిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories