Celebrity Food: బాలీవుడ్ సెలబ్రిటీలకు తెగ నచ్చేస్తున్న రెసిపీ..మీరు ట్రై చేస్తారా?

Published : Nov 25, 2026, 02:25 PM IST

సెలబ్రిటీలు, హీరోయిన్స్ ఏం తింటారనేదానిది తెలుసుకోవాలంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ల డైట్ ఫుడ్, ఇష్టమైన ఫుడ్ ఏంటీ అని తెలుసుకుంటుంటారు. అయితే ఈ మధ్య ఒక ఫుడ్ ని బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాని గురించే SMలో చర్చ నడుస్తోంది.

PREV
15
సెలబ్రిటీల ఫేవరేట్ ఫుడ్

సెలబ్రిటీలు ఏం తింటారు? ఎలాంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు? అనే విషయాలపై చాలా మందికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇష్టమైన సెలబ్రిటీలు చెప్పే ఫుడ్ రెసిపీలను ఇంట్లో ట్రై చేస్తుంటారు కూడా. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇష్టపడే ఓ మహారాష్ట్ర వంటకం...ఫుడ్ లవర్స్ ని ఆకర్షిస్తోంది. అదే 'థేచా' (Thecha). పచ్చిమిర్చి, వెల్లుల్లి, వేరుశెనగలతో తయారయ్యే ఈ స్పైసీ చట్నీని పరోటాలతో కలిపి తినడం ఇష్టమని ప్రియాంక గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి సెలబ్రిటీల ఫుడ్ ఛాయిస్‌లో భాగమైన ఈ స్పెషల్ చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

25
థేచా తయారీకి కావాల్సిన పదార్థాలు

- వెల్లుల్లి రెబ్బలు – 10 నుంచి 12 - పచ్చిమిర్చి – 5 - వేరుశెనగలు – 2 టేబుల్ స్పూన్లు - జీలకర్ర – 1 టీ స్పూన్ - కొత్తిమీర – ఒక గుప్పెడు - కారం (ఎండు మిర్చి పొడి) – అర టీ స్పూన్ - ఉప్పు – తగినంత - నిమ్మరసం – రుచికి సరిపడా.

35
థేచా చట్నీ తయారీ విధానం

ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, వేరుశెనగలు, జీలకర్ర వేసి పొడిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి పైపొరపై నల్లటి మచ్చలు వచ్చే వరకు వేయిస్తే చట్నీకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత రోట్లో వేసుకోవాలి.

వీటికి తాజా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు కలిపి రోట్లో దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా నూరుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే.. ఘాటైన మహారాష్ట్ర స్పెషల్ థేచా చట్నీ సిద్ధం. వేడివేడి పరోటాలు, రొట్టెలతో కలిపి ఆస్వాదించవచ్చు.

45
రుచిగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి

థేచా తయారీలో వాడే పచ్చిమిర్చి రకం బట్టి టేస్ట్ మారుతుంది. జ్వాలా మిర్చితో చేస్తే కారం కాస్త తక్కువ ఉంటుంది. లవంగి మిర్చి వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది. కారం తక్కువగా తినేవారు కారం లేని మిర్చిని ఎంచుకోవచ్చు. పచ్చిమిర్చిని వేయించేటప్పుడు వాటి పైపొరపై నల్లటి మచ్చలు వచ్చేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల చట్నీకి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిని దంచేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే మిగతా పదార్థాలతో సులభంగా కలుస్తుంది. ముఖ్యంగా ఈ చట్నీ తయారీలో నీటిని అస్సలు ఉపయోగించకూడదు. నీరు కలిపితే చట్నీ టేస్ట్ మారిపోతుంది. త్వరగా పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది.

55
థేచాలోనూ రకరకాల వెరైటీలు

థేచాలో కూడా ప్రాంతాన్ని బట్టి రకరకాల వెరైటీలు ఉన్నాయి. కొల్హాపురి స్టైల్ థేచా చాలా ఘాటుగా ఉంటుంది. మరికొన్ని రకాలలో వేరుశెనగలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొబ్బరితో తయారు చేసే థేచా, పచ్చి మామిడికాయతో చేసే వెరైటీలు కూడా ఉన్నాయి. ఎండు మిర్చి, వెల్లుల్లి ఎక్కువగా వేసి కూడా తయారు చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories