Sleeping At Afternoon: మధ్యాహ్నం తిన్న వెంటనే కునుకు తీస్తున్నారా ? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

Published : Feb 17, 2022, 02:45 PM IST

Sleeping At Afternoon: తిన్న తర్వాత ఓ చిన్న కునుకు తీస్తే ఎంత బావుంటుందో అనకునే వారు చాలా మందే ఉన్నారు. అంతెందుకు స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే ఆఫీసులకు వెళ్లే వారుకుడా తిన్న తర్వాత నిద్రమబ్బుతో ఉంటారు. ఆ సమయంలో కాసేపు నిద్రపోతే ఎంతబావుంటుందో అనుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది నిద్రను కంట్రోల్ చేసుకోలేక ఓ చిన్న కునుకు తీసేస్తుంటారు. మరి మధ్యాహ్నం సమయంలో పడుకోవడం మంచిదేనా?

PREV
18
Sleeping At Afternoon: మధ్యాహ్నం తిన్న వెంటనే కునుకు తీస్తున్నారా ? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

Sleeping At Afternoon: మధ్యాహ్నం పూట తిన్న వెంటనే  చాలా మందికి నిద్ర మత్తుగా అనిపిస్తుండటం చాలా కామన్. అందులోనూ ఆ సమసయంలో నిద్ర కంట్రోల్ చేసుకోలేనంతగా ఉంటుంది. అబ్బా కాసేపు పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అనుకుంటారు. ఇలాంటి నిద్ర సూల్ పిల్లల నుంచి మొదలు పెడితే ఆఫీసుల్లో పనిచేసే వారికి కూడా వస్తుంది. మరికొంతమందైతే .. నిద్రను కంట్రోల్ చేసుకోలేక ఓ చిన్న కునుకు తీస్తుంటారు. కొంతమంది మాత్రం ఈ సమయంలో పడుకుంటే రాత్రి పూట జాగారం తప్పదని నిద్రను బలవంతంగా ఆపుకుంటారు. 

28

కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు.  ఈ మధ్యాహ్నం నిద్రతో ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రశాంతమైన నిద్ర మన లైఫ్ కు ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. 
 

38

మధ్యాహ్నం తిన్న తర్వాత కాసేపు పడుకోవడం వల్ల  Digestion మెరుగ్గా పనిచేస్తుందట. అంతేకాదు దీనివల్ల ఉదర సంబంధిత రోగాలు వచ్చే అవకాశం కూడా తక్కువుగా ఉంటాయి.
 

48

నిద్రవల్ల ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడొచ్చు. అలాగే ప్రశాంతంగా నిద్రించడం వల్ల హై బీపీని సైతం కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

58

థైరాయిడ్ (Thyroid),మధుమేహం (Diabetes), పీసీఓడీ వంటి అనేక సమస్యలకు నిద్ర ఓ చక్కటి పరిష్కారం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

68

హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు దానికి చక్కటి పరిష్కారం మధ్యాహ్నపు నిద్ర. పగలు  తిన్న తర్వాత నిద్రపోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అంతేకాదు మెరుగ్గా పనిచేస్తాయట. ముఖ్యంగా మధ్యాహ్నపు నిద్రతో  Bad fat ఇట్టే కరిగిపోతుందని నిపుణుల చెబుతున్నారు. 
 

78

వివిధ అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగే స్థూలకాయ (Obesity) సమస్య నుంచి ఈజీగా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు.

88

మధ్యాహ్నం పూట చిన్న పిల్లలు పెద్దవారు గంట పాటు బేషుగ్గా పడుకోవచ్చు. అదే ఆరోగ్యవంతులు 25 నుంచి 30 నిమిషాలు కునుకు తీసేయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories