Stylish tips: మనిషి వ్యక్తిత్వాన్ని దుస్తులు నిర్దారించలేవు. కానీ ఒక వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆ వ్యక్తి డ్రెస్సింగ్ సెన్స్ ను బట్టే నిర్దారించుకోవచ్చని కొందరు భావిస్తుంటారు. మన దుస్తులను బట్టే మనకు గౌరవం లభిస్తుందని అనుకుంటారు. వాస్తవానికి బట్టలు మన గౌరవాన్ని నిర్దారించలేవు. ఒక వ్యక్తి తనకు నచ్చిన బట్టలను వేసుకునే స్వేచ్ఛ ఉంది. అయితే ఆ బట్టలు నలుగురూ మెచ్చాలని లేకపోయినా.. మనల్ని అందరిలో అందంగా నిలబెట్టడానికి కొన్ని రంగుల దుస్తులు ఎంతో సహాయపడతాయి. అవే ప్రొఫెషనల్ లుక్ ను అందిస్తాయి. అందులోనూ సాలిడ్ రంగుల బట్టలు మీకు బాగా సూటవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాఫీ కలర్ దుస్తులు: కాఫీ కలర్ లో ఉండే బట్టలు ఈ చలికాలంలో మీ రూపాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. అంతేకాదు ఇవి మిమ్మల్ని నలుగురిలో ఆకర్షణగా నిలబెడుతాయి. కాఫీ కలర్ లో ఉండే టాప్స్ పై బ్లాక్ కలర్ లెగ్గింగ్ ధరిస్తే మీరు చాలా చాలా క్యూట్ గా కనిపిస్తారు.
Dark Orange: డార్క్ ఆరెంజ్ కలర్ డ్రెస్సులు ఎంతో అందంగా ఉంటాయి. ఈ రంగు డ్రెస్సులను పార్టీలకు, ఫంక్షన్లకు వేసుకుని వెళ్లడం వల్ల మీరు మరింత అందంగా, ఆకర్షణగా నిలుస్తారు. Dark Orange టాప్ పై బ్లాక్ కలర్ స్కర్ట్ వేసుకుంటే కెవ్వు కేక అనిపిస్తారు. ఇది ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. కాబట్టి నారింజ కలర్ డ్రెస్సులను వేసుకోవడానికి నామోషీగా ఫీలవ్వకండి.
Solid Yellow: ఎల్లో కలర్ కు ఫ్యాన్స్ ఎక్కువే. ఎందుకంటే పసుపు రంగు దుస్తులు మీరు ఎల్లో కలర్ ఏంజెల్ లా కనిపించేలా చేస్తాయి. నలుగురిలో మీరే అందంగా కనిపించేలా చేస్తాయి. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో ఎటైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు సాలిడ్ ఎల్లో డ్రెస్సులను వేసుకోండి. ఈ సాలిడ్ ఎల్లో ఎంతో శక్తివంతమైనదని సౌందర్య నిపుణులు భావిస్తున్నారు.
Multi Colors: మల్టీ కలర్స్ లో దుస్తులను ధరించాలనుకుంటే మీకు బెస్ట్ Options పసుపు, ఆకుపచ్చ రంగులు. ఈరెండింటి కాంబో కలర్స్ లో ఉండే దుస్తులు మీకెంతగానోనప్పుతాయి. వీటిని వద్దనుకుంటే పింక్, గ్రే కాంబో కూడా సూపర్ గా సెట్ అవుతుంది. ఈ కాంబోలల్లో ఉండే దుస్తులు మీరు క్లాసిక్ గా కనిపించేలా చేస్తాయి. స్నేహితులతో బయటకు వెళ్లేటప్పుడు లేదా ఆఫీసులకు వెళ్లేటప్పుడు వేసుకున్నా బాగుంటుంది.
ప్రొఫెషనల్ లుక్: మీరు ప్రొఫెషనల్ లుక్ లో కనిపించాలంటే మాత్రం కొన్ని రంగుల దుస్తులనే వేసుకోవాల్సి ఉంటుంది. Dark green టాప్ పై బ్లాక్ డెనిమ్ డ్రెస్ ను వేసుకోవచ్చు. ఇలాంటి కాంబో డ్రెస్ ను ఆఫీసులకు వెళ్లే టప్పుడు వేసుకుంటే బావుంటుంది. ఇలాంటి డ్రెస్ తో అందరి చూపు మీ వైపే ఉంటుంది. ఇక ఈ డ్రెస్సులకు తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ ధరించండి. ఇవి మిమ్మల్ని మరింత అందంగా, ఆకర్షణగా ఉంచుతాయి.