Women : ఆడవారికి కూడా మీసాలు, గడ్డాలు రావడానికి కారణాలేంటో తెలుసా?

Published : Feb 17, 2022, 01:52 PM IST

Women : కొంతమంది ఆడవారు అవాంచిత రోమాలతో తెగ ఇబ్బందిపడుతుంటారు . వాటిని తొలగించడానికి నానా రకాల ప్రయోగాలు చేస్తుంటారు. అసలు అవెందుకు వస్తాయో తెలుసా..? 

PREV
15
Women : ఆడవారికి  కూడా మీసాలు, గడ్డాలు రావడానికి కారణాలేంటో తెలుసా?

Women : కొంతమంది అమ్మాయిలు అవాంచిత రోమాలతో తెగ ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా నలుగురిలోకి ధైర్యంగా వెల్లలేకపోతుంటారు. వారు చూడటానికి అందంగా ఉన్నా.. మూతిపై, చంపలపై వెంట్రుకలు వారిని అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. ఆ కారణం చేతనే ఈ సమస్య ఉన్నవారు నలుగురిలోకి వెళ్లే సాహసం చేయరు. అందులోనూ వీరు మందిలో ఉన్నప్పుడు లేదా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎవరో ఒకరు నువ్ మగరాయుడిలా మీసాలు, గడ్డాలతో బలే ఉన్నావ్ అంటూ వెక్కిరింతలపాలయ్యే ఉంటారు. ఇటువంటి అవమానాల కారణం చేత కూడా చాలా మంది అమ్మాయిలు నలుగురిలోకి వెళ్లడానికి బిడియపడుతారు.

25

అమ్మాయిలకు మీసాలు , గడ్డాలు రావడాన్ని హిర్సుటిజం అని అంటారు. ఇవి  Hormonal disorder వల్ల వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువగా ఊబకాయుల్లోనే కనిపిస్తుంది. బాడీలో Vital hormones ను రిలీజ్ చేసే థైరాయిడ్, పిట్యూటరీ వంటి అనేక Glands Hormone‌ system లో లోపాలు తలెత్తుతాయి. అదే సమయంలో Male hormone levels పెరిగి ఈ మీసాలుల, గడ్డాలపై వెంట్రుకలు పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు Steroids, కొన్ని రకాలైన మెడిసిన్స్ మూలంగా కూడా ఈ అవాంఛిత రోమాలు వస్తాయట.
 

35

ఈ అవాంఛిత రోమాల సమస్య తలెత్తినప్పుడు చాలా మంది ఆడవారు వైద్యులను సంప్రదించకుండా.. వాటిని తొలగించడానికి  ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. షేవింగ్ చేయడం, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడటం, ప్లకింగ్, త్రెడింగ్, లేజర్ ట్రీట్మెంట్ వంటి పద్దతులను అనుసరిస్తున్నారు. అయితే ఈ హెయిర్ రూమూవల్ విషయంలో వైద్యుల సలహాలను  సూచనలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా కూడా వీటిని ఈజీగా తొలగించవచ్చు. అవేంటో చూద్దాం పదండి..
.

45

ఒక టీ స్పూన్ చొప్పున నిమ్మరసం, షుగర్ తీసుకుని ఆ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. దాన్ని అవాంఛిత రోమాలపై అప్లై చేయాలి. దాన్ని ఇక అర్థగంట పాటు అలాగే ఉండనిచ్చి.. ఆ తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై రోజు వాటర్ పెట్టాలి. ఈ పద్దతిని క్రమం తప్పకుండా పాటించినట్టైతే చక్కటి ఫలితం లభిస్తుంది.
 

55

పసుపులో ఎన్నో దివ్య ఔషదాలుంటాయని అని మనందరికీ తెలిసిందే. ఈ పసుపుతో అవాంఛిత రోమాలకు చెక్ పెట్టొచ్చు. అందుకోసం ఏం చేయాలంటే.. స్వచ్చమైన పసుపును కొద్దిగా తీసుకుని అందులో కాసిన్ని నీళ్లు పోసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దాన్ని అవాంఛిత రోమాలపై రాయాలి. దాన్ని ఒక అరగంట సమయం అలాగే ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి.  ఇలా నెలపాటు  ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తే ఆ అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.  
 

Read more Photos on
click me!

Recommended Stories